వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==కొబ్బరి చెట్టు==
కొబ్బరి చెట్టు లాటిన్ పేరు కోకస్ న్యుసిఫెరా. తెలుగులో నారికేళం, టెంకాయ, కొబ్బరి అంటారు.
కొబ్బరి చెట్టు కాండం గుండ్రంగా పొడవుగా పెరుగుతుంది కాండానికి పెద్ద ఆకులు మధ్యలో ఈనె కలిగి ముదురాకు పచ్చ రంగు లో ఉంటాయి. పూలు ఎరుపు, పసుపు రంగు కలిగి కాండానికి పూస్తాయి.

కాయలు పెద్దవిగా మూడుముఖాలతో ఉంటాయి, మొదట ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు బూడిద రంగు లోకి మారతాయి. కాయ లోపల గట్టి టెంక దాని చుట్టూ పీచు ఉంటుంది, టెంక లోపల తెల్లటి కొబ్బరి,నీళ్ళూ ఉంటాయి. కొబ్బరి కాయ లోని నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి మంచి పౌష్టికాహారం ప్రొటీన్లను కలిగిఉంటుంది.
 
దీని కాండం లో చిన్న పాటి పడవడలు తయారుచేస్తారు, ఆకులు ఇంటి పైకప్పుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఆకు ఈనెలతో చీపుళ్ళు తయారు చేస్తారు. కొబ్బరి పీచు తో తాళ్ళు, తివాచీలు తయారు చేస్తారు. టెంకను వంట చెరకుగా ఉపయోగిస్తారు. టెంక లోపలి కొబ్బరి తో నూనె తయారు చేస్తారు,పచ్చి కొబ్బరితో కూరలూ, పచ్చళ్ళు చేసుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు