ఎగిరే పళ్ళాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''ఎగిరే పళ్ళాలు ''' లేదా UFO (unidentified flying object) అనునవి ఒక గుర్తింపబడని వాహనాలు. ఇవి సాధారణంగా [[గ్రహాంతరవాసులు|గ్రహాంతర వాసుల]] వాహనాలని ప్రజలు నమ్ముతారు.ఇతర గ్రహాల నుంచి ఎగిరే పళ్లాలు కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.
==వివరాలు==
ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని,వారు మనకన్నా చాలా తెలివైనవారని,వారే గ్రహాంతర వాసులు(Alien's) అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.
== సంకేతాలు==
1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.<ref>https://voyager.jpl.nasa.gov/golden-record/</ref>
 
1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్‌ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్‌వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది.<ref>{{cite web|last1=Wood|first1=Lisa|title=WOW!|url=https://www.ohiohistory.org/learn/collections/history/history-blog/2010-(1)/july-2010/wow|website=Ohio History Connection Collections Blog|date=July 3, 2010|access-date=2016-07-02}}</ref>
 
==ప్రభుత్వాల పరిశోధన==
===అమెరికా===
"https://te.wikipedia.org/wiki/ఎగిరే_పళ్ళాలు" నుండి వెలికితీశారు