సాకం నాగరాజ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
తెలుగు రాష్ట్రాలలోని సాహిత్య కారులకు సుపరిచితమైన పేరు సాకం నాగరాజ. విప్లవకవి [[వరవరరావు]] మొదలు ప్రముఖ [[కవి యాకూబ్]] వరకు, తిరుపతి అనగానే నాగరాజ పేరునే ప్రస్తావిస్తారు. తిరుపతిలో తెలుగు సాహిత్య కార్యక్రమం ఎవరు నిర్వహించినా ముందుండి తన సహకారాలను అందించే తత్వం నాగరాజది. తెలుగు భాష కలకాలం నిలబడాలన్నా..... విధ్హ్యార్తులలో భాషా పరిజ్ఞానము పెరగాలన్నా విజ్ఞానాభివృద్దికి.... విద్యార్థులు పుస్తక పఠనం చేయాలని ఆశించే ఇతను, ఆ దిశగా తన వంతు ప్రయత్నంగా [[తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి]] అనే సంస్థను స్థాపించి..... తద్వారా పుస్తకాలను ప్రచురించి చిత్తూరు జిల్లాలో అనేక పాఠశాలకు, కళాశాలలకు స్వయంగా వెళ్ళి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంచి వారిచే పుస్తకాలను చదివించేవారు.<ref>{{cite news|title=World Children’s Book Day observed with zeal in Tirupati|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/world-childrens-book-day-observed-with-zeal-in-tirupati/article4575366.ece|publisher=The Hindu|date=2013-03-03|accessdate=2015-03-03 }}</ref> ఈ కార్యక్రమాన్ని [[ప్రపంచ పుస్తక దినోత్సవం]] నాడు సంకల్పించి ఒక వారంపాటు దాన్ని ఒక పండుగగా చేసేవారు. ఈ కార్యక్రమంలో అమ్మచెప్పిన కథలు,, స్వయంగా వ్రాసిన బాల నిఘంటువు, పిల్లల పుస్తకాన్ని (బాపు బొమ్మలతో) వేలాదిగా విద్యార్థులకు పంచారు. పుస్తక పఠనం మనిషి జీవితాన్ని మార్పు చేస్తుందని నమ్మిన వ్యక్తి సాకం నాగరాజ. ఈ పుస్థక పఠన ఉద్యమాన్ని చిత్తూరు జిల్లాలోనే కాక [[విశాఖపట్నం జిల్లా]]లోకూడ నిర్వహించి విద్యార్థులలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించారు.
 
<ref>More online free content in Telugu Wikipedia soon </ref>[[తెలుగు వికీపీడియా]] తిరుపతిలో నిర్వహించిన 11వ వార్షికోత్సవాలలో తనవంతు సహకారాన్ని అందించి 88 కథలున్న "పిల్లల పుస్తకం" యొక్క కాపీహక్కుల్ని వికీసోర్స్ కు అందించారు.<ref>{{cite news|title=More online free content in Telugu Wikipedia soon|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/more-online-free-content-in-telugu-wikipedia-soon/article6899801.ece|publisher=The Hindu|date=2015-02-16|accessdate=2015-03-04}}</ref>
 
<ref>సాక్షి చిత్తూరు: 13.9.2008. ప్రపంచ పుస్తక పఠన దినోత్సవ సందర్భంగా వచ్చిన వార్త</ref>గతంలో పాఠకుల కోసం, స్కూలు విద్యార్థుల కోసం అనేక పుస్తకాలు వెలువరించిన సాకం నాగరాజ కాలేజీ విద్యార్థుల కోసం ప్రపంచ కథా సాహిత్యాన్ని ఒక చోట చేర్చి పుస్తకంగా వెలువరించారు. అమ్మడానికి కాదు. పంచి పెట్టడానికి. పది మంది చదివి ఇద్దరు అందుకున్నా చూసి సంతోష పడటానికి. జీవితంలో పైకొచ్చినవారంతా ఏదో ఒక దశలో పుస్తకాలను ఆలంబనగా చేసుకున్నవారే. మన పిల్లలకు ఇప్పటి నుంచే ఎందుకు వాటిని అలవాటు చేయకూడదు అనేది సాకం ఆలోచన<ref>{{citeweb|url=http://www.sakshi.com/news/family/for-students-in-the-world-of-the-story-lyrics-202385|title=విద్యార్థుల కోసం ప్రపంచ కథాసాహిత్యం|publisher=sakshi.com|date= 09-01-2015|accessdate=04-03-2015}}</ref>.
"https://te.wikipedia.org/wiki/సాకం_నాగరాజ" నుండి వెలికితీశారు