ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎మరణం: లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 183:
 
సెమ్మెల్విస్ రుగ్మత ఏమిటనేది చర్చనీయాంశమైంది. కే కోడెల్ కార్టర్ తను రచించిన సెమ్మెల్విస్ జీవిత చరిత్రలో, అతనిది ఏ వ్యాధన్నది కచ్చితంగా తెలియరాలేదని పేర్కొన్నాడు:
<blockquote>సెమ్మెల్విస్ రుగ్మత ఏమిటనేది కచ్చితత్వం తో అంచనా వేయడం అసాధ్యం. ... ఇది [[మతిమరపు వ్యాధి]] అయ్యుండొచ్చు. మతిమరపు వ్యాధి ఒక రకమైన చిత్తవైకల్యం. వేగంగవంతమైన అభిజ్ఞా క్షీణత, భావోద్వేగ మార్పులు ఈ వ్యాధి లక్షణాలు. ఇది మూడవ దశ సిఫిలిస్ ({{ill|Syphilis|en}}) కావచ్చు{{sfn|Nuland|2003|p=270}}. ధర్మాసుపత్రులలో వేలాది మంది మహిళలకు చికిత్స చేసిన ప్రసూతి వైద్యులకు ఆరోజుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేది. ఇవేవి కాక పని ఒత్తిడి, మానసిక ఒత్తిళ్ళ వల్ల కలిగిన తీవ్ర మానసిక అలసట కూడా అయ్యుండొచ్చు{{sfn|Carter|Carter|2005|p=75}}.</blockquote>1865 లో, జెనోస్ బాలస్సా ({{ill|János Balassa|en}}) సెమ్మెల్విస్‌ను మానసిక వైద్య సంస్థలో ({{ill|Psychiatric hospital|en}}) చేరాల్సిందిగా సిఫార్సు చేస్తూ ఒక పత్రాన్ని రాశాడు. జూలై 30 న, ఫెర్డినాండ్ రిట్టర్ వాన్ హెబ్రా తన "కొత్త సంస్థలలో" ఒకదానిని చూపించే నెపంతో సెమ్మల్విస్ ను లాజారెట్‌గాస్సే లో ఉన్న వియన్నా మానసిక వ్యాధిగ్రస్తుల ఆశ్రయానికి తీసుకువెళ్ళాడు. ఏమి జరుగుతుందో గ్రహించిన సెమ్మల్వెస్ పారిపోవడానికి ప్రయత్నించగా,{{sfn|Benedek|1983|p=293}}అక్కడి కాపలాదారులు అతన్ని చితకబాది స్ట్రెయిట్‌జాకెట్‌తో కట్టి, చీకటి గదికి పరిమితం చేశారు. అక్కడ అతనికి అందించిన ఇతర చికిత్సలు చన్నీళ్ళలో ముంచడం, ఆముదం నూనె అనే భేదిమందు ఇవ్వడం. అతను రెండు వారాల తరువాత, 1865 ఆగస్టు 13 న, 47 సంవత్సరాల వయస్సులో, అతని కుడి చేతి గాయానికి చీము పట్టడంతో మరణించాడు. శవపరీక్షలో మరణానికి కారణం పైమియా-బ్లడ్ పాయిజనింగ్ అని తేలింది.{{sfn|Carter|Carter|2005|p=76–78}}
 
1865 ఆగస్టు 15 న సెమ్మెల్విస్‌ను వియన్నాలో ఖననం చేశారు. కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతని మరణం గురించి సంక్షిప్త ప్రకటనలు వియన్నా, బుడాపెస్ట్ లోని కొన్ని వైద్య పత్రికలలో వెలువడ్డాయి. హంగేరి వైద్యులు మరియు ప్రకృతి శాస్త్రవేత్తల సంఘం నియమాల ప్రకారం మునుపటి సంవత్సరంలో మరణించిన సభ్యుల గౌరవార్థం స్మారక ప్రసంగం చేయాలని పేర్కొన్నప్పటికీ, సెమ్మెల్వీస్‌కు ఆ గౌరవం దక్కలేదు సరికదా; కనీసం అతని మరణం యొక్క ప్రస్తావన కూడా లేదు{{sfn|Carter|Carter|2005|p=79}}.