అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అన్నవరం ప్రసాదం''' అన్నది [[అన్నవరం]]<nowiki/>లోని [[రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం|సత్యనారాయణ స్వామికి]] నివేదన చేసి దేవస్థానంలో అమ్మే [[గోధుమనూక]]<nowiki/>తో తయారుచేసే తియ్యని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. [[తిరుపతి లడ్డు]] లాంటి ప్రసాదాలతోనూ, [[కాకినాడ కాజా]], [[ఆత్రేయపురం]] [[పూతరేకులు]] వంటి స్వీట్లతోనూ అన్నవరం ప్రసాదాన్ని పోల్చుతూ ఉంటారు. ఈ ప్రసాదం స్వామివారికి ఎప్పటి నుంచి నివేదిస్తున్నారు అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు. ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి నుంచి ఇది అలవడి ఉంటుందని కొందరు పేర్కొంటుండగా, ఇది తరతరాలుగా వస్తున్నదని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు. ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 100 కళాయిల్లోనూ, రద్దీ ఎక్కువ ఉండే ప్రత్యేక దినాల్లో 250 కళాయిల్లోనూ దీన్ని తయారుచేస్తారు. కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. మొత్తం ఏడాదిలో దాదాపు కోటీ 50 లక్షల ప్యాకెట్ల ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ, కొనదలుచుకున్న భక్తులకు కొండ మీద, కింద, నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు