ముక్కోటి ఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
 
ఏడాదికి 24 [[ఏకాదశులు]] వస్తాయి. [[సూర్యుడు]] [[ఉత్తరాయణం|ఉత్తరాయణానికి]] మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే '''వైకుంఠ ఏకాదశి''' లేదా '''ముక్కోటి ఏకాదశి''' అంటారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-article/temples/vykunta-ekadasi-spl-story/0703/120161082|title=Vykunta Ekadas వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?|website=EENADU|language=te|access-date=2022-01-13}}</ref> సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే '[[మార్గం]]' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర [[ద్వారం]] వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు [[మహావిష్ణువు]] గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు [[కోట్లు|కోట్ల]] ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.
 
ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.
"https://te.wikipedia.org/wiki/ముక్కోటి_ఏకాదశి" నుండి వెలికితీశారు