#WPWP2023 మార్చు

https://hashtags.wmcloud.org/graph/?query=WPWP&project=&startdate=2023-07-01&enddate=2023-08-31&search_type=or&user=

 
#WPWP 2023 77 ప్రాజెక్టులలో 3135 బొమ్మలు చేర్చాను

https://hashtags.wmcloud.org/graph/?query=WPWP&project=&startdate=2023-07-01&enddate=2023-08-31&search_type=or&user=muralikrishna+m

మీకు తెలుసా? మార్చు

... అన్నామలై యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో దూరవిద్యను అందించే మొట్టమొదటి భారతీయ విశ్వవిద్యాలయం అనీ!

... భారత్, సోవియట్ యూనియన్ మైత్రికి చిహ్నంగా మైత్రి బాగ్ స్థాపించబడిందనీ!

... భారతీయ నటుడు కబీర్ బేడీ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించాడనీ!

... భారత రైల్వే ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదనీ!

... హిమాలయ పర్వత సానువుల్లో పర్వతారోహణకు జోషిమఠ్ను ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారనీ!

... గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అంతర్జాతీయంగా సినిమాలు, టెలివిజన్ రంగంలో ఇచ్చే పురస్కారాలనీ!

... షాన్ గా పేరుపొందిన భారతీయ గాయకుడి అసలు పేరు శంతను ముఖర్జీ అనీ!

... కాకతీయుల కాలం నాటి ఆది మహావిష్ణువు ఆలయం తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో 2015లో బయట పడిందనీ!

... నృత్య, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన 40 ఏళ్ళ లోపు అత్యుత్తమ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందజేస్తారనీ!

... నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్, ఆమె భర్త కలిసి కళల్లో సాంప్రదాయ విలువల పరిరక్షణ కోసం కళాక్షేత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేశారనీ!

...మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దక్షిణ భారతదేశంలో ఏర్పాటయిన మొట్టమొదటి సంగీత పీఠాల్లో ఒకటనీ!

... సంతోషిమాత ను ఆరాధించే భక్తులు పులుపు తినరాదనే నియమం ఉందనీ!

... అమెరికాలోని షికాగో లో ప్రత్యేకించి మహిళలు, పిల్లల కోసం ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ అనే దుకాణం ఉందనీ!

... రాణి శంకరమ్మ ఆంథోల్‌ సంస్థానాన్ని పాలించిన మహారాణి అనీ!

... తమిళనాడు శ్రీరంగం ఆలయంలో శ్రీరంగనాథుని సతి రంగనాయకి అమ్మవారు అనీ!

... ప్రముఖ నర్తకి చంద్రలేఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ మేనకోడలు అనీ!

... అనురూప రాయ్ ఇప్పటికీ తోలు బొమ్మలాట కళను కొనసాగిస్తున్నదనీ!

... బాలీవుడ్ నటి నూతన్ తన సహజ సిద్ధమైన నటనకు పేరు గాంచిందనీ!

... జీరో షాడో డే రోజున కొన్ని నిమిషాల పాటు వస్తువుల నీడ కనిపించదనీ!

... ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికల్లో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు అనీ!

... 2021 లో సామాజిక శాస్త్రాలలో కృషికి గాను ప్రతీక్ష బక్షి ఇన్ఫోసిస్ ప్రైజు గెలుచుకుందనీ!

... బీహార్ కు చెందిన సుభద్రా దేవి మధుబని చిత్రకళలో పేరు గాంచిందనీ!

... కేరళను పాలించిన ట్రావెన్ కూర్ రాజులు 1859 వరకు రొమ్ము పన్ను విధించే వారనీ!

... తెలుగు క్లాసిక్‌ గోరింటాకు (1979) చిత్రంలోని కథానాయకి వక్కలంక పద్మ ఇప్పుడొక అంతర్జాతీయ జర్నలిస్ట్‌ అనీ!

... క్రికెట్ క్రీడాకారిణి శుభాంగి కులకర్ణి 1985 లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకుందనీ!

... చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ సాధించిన మహిళా గ్రాండ్ మాస్టర్ సుబ్బరామన్ విజయలక్ష్మి అనీ!

... యునైటెడ్ కింగ్‌డం కి మొదటి మహిళా ప్రధాన మంత్రిగానే కాక ఆ పదవిలో దీర్ఘకాలం ఉన్నది మార్గరెట్ థాచర్ అనీ!

... మరాఠీ గాయకురాలు అంజలి మరాఠీ 16 సంవత్సరాల వయసులోనే జాతీయ పురస్కారం అందుకుందనీ!

... పురాతమైన సంతాలీ భాష కోసం ప్రత్యేకమైన లిపిని సృష్టించింది రఘునాథ్ ముర్ము అనీ!

... ఐఎఎస్ అధికారి పాపారావు బియ్యాల మాదకద్రవ్య రహిత క్రీడల కోసం కృషి చేశాడనీ!

... కేరళ లోని కుంబలంగి దేశంలో తొలి శానిటరీ నాప్కిన్ రహిత ప్రాంతంగా పేరొందింది అనీ!

... ఇక్రిశాట్‌ అనేది భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రమనీ!

... పంచాంగ కర్తగా పేరొందిన ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మునుపు మిమిక్రీ కళాకారుడిగా పనిచేశాడనీ!

... బాండిట్‌ క్వీన్‌ బందిపోటు రాణి ఫూలన్ దేవి జీవితం ఆధారంగా వచ్చిన హిందీ సినిమా అనీ!

... ఎర్త్ అవర్ గ్లోబల్ వార్మింగ్ మీద అవగాహన కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తారనీ!

...భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన థామస్ బాబింగ్టన్ మెకాలే భారతీయ శిక్షాస్మృతి సృష్టికర్త అనీ!

... రాజ్‌మా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన వంట దినుసు అనీ!

... భారతదేశంలో విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ అనీ!

... ఉదయ్ ఉమేశ్ లలిత్ భారత సుప్రీంకోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడనీ!

... ప్రొతిమా బేడి భారతదేశపు ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి అనీ!

... మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి సాహు మహరాజ్ 19 వ శతాబ్దంలోనే తన పరిపాలనలో ప్రగతిశీల విధానాలను అవలంభించాడనీ!

... బాలనటిగా రాణిస్తున్న నైనికా విద్యాసాగర్ దక్షిణ భారత నటి మీనా ఏకైక కూతురనీ!

... వీరేంద్ర హెగ్డే కర్ణాటకలోని ధర్మస్థళ ఆలయ వంశపారంపర్య నిర్వాహకుడనీ!

... భారతదేశంలో అతిపెద్ద వైద్యుల సంఘం భారతీయ వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) అనీ!

... ‎ఆకాశ ఎయిర్ భారతదేశపు బిలియనీర్ రాకేశ్ ఝుంఝున్ వాలా స్థాపించిన విమానయాన సంస్థ అనీ!

... షింజో అబే జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అనీ!

... రోష్ని నాడార్ భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటయిన హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఛైర్‌పర్సన్ అనీ!

... ఆర్. కె. నారాయణ్ కథల ఆధారంగా మాల్గుడి డేస్ ధారావాహికకు దర్శకత్వం వహించింది శంకర్ నాగ్ అనీ!

... నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం అనీ!

... ఛెల్లో షో అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న భారతీయ సినిమా అనీ!