పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా మహిళా నేపథ్య గాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''పి.సుశీల''' (పులపాక సుశీల) గాయకురాలు. సుశీల [[విజయనగరం]]లో 1935 నవంబరు 13 న13న సంగీతాభిమానుల [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడుగు భాష|బడుగ]], [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె [[ఏ.ఎమ్.రాజా]]తో కలిసి ''పెట్ర తాయ్'' (తెలుగులో [[కన్నతల్లి (1953 సినిమా)|కన్నతల్లి]]) అనే సినిమాలో ''ఎదుకు అలత్తాయ్'' అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె [[శ్రీలంక]] చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష [[తెలుగు]] అయినప్పటికీ కొద్దిగా [[హిందీ]], [[కన్నడ భాష|కన్నడ]] భాషలలో మాట్లాడగలదు. [[తమిళ భాష|తమిళ]] భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆమె వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావుతో వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, [[శుభశ్రీ (గిటారిస్ట్‌)|శుభశ్రీ]] అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు [[సంధ్య జయకృష్ణ]] ఇరువర్ అనే తమిళ చిత్రంలో [[ఎ. ఆర్. రెహమాన్|ఎ.ఆర్. రహమాన్‌తో]] కలసి ఆరంగేట్రం చేసిన గాయని.
 
[[ఎస్.ఎస్. తమన్|తమన్‌]] బృందంలో శుభశ్రీ చేరి [[అల వైకుంఠపురంలో|అల వైకుంఠపురం]] చిత్రంలోని ‘సామజవరగమన’, ‘రాములో రాములా...’ పాటలకు గిటార్‌ ప్లే చేసారు. తర్వాత [[వెంకీ మామ|వెంకీమామ]], [[వకీల్‌ సాబ్|వకీల్‌ సాబ్‌]], [[గని (2021 సినిమా)|గని]], [[భీమ్లా నాయక్|భీమ్లా నాయక్‌]], [[రాధేశ్యామ్‌]] (నేపథ్య సంగీతం) సినిమాలకు పని చేసారు.<ref>{{Cite web|title=నాయనమ్మ పేరు చెడగొట్టద్దని...|url=https://www.eenadu.net/telugu-news/women/general/6204/122040073|access-date=2022-02-27|website=EENADU|language=te}}</ref>
 
== చదువు ==
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు