భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
==ప్రముఖ జనసంఘ్ నాయకులు==
;లాల్ కృష్ణ అద్వానీ {{main|లాల్ కృష్ణ అద్వానీ]]}}
:[[1927]]లో [[కరాచి]]లో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భాజపాలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అద్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనసంఘ్" నుండి వెలికితీశారు