తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ఇతరాలు==
శైవ భక్తిపూర్వకం కాని ఇతివృత్తమేదీ శివకవుల రచనకు ఇతివృత్తం కాలేదు. వారు శ్లాఘించినది ఇతర శివకవులను మాత్రమే. వారి జీవితము, కవిత్వము కూడా శివార్పణమే. వీరు కవిత్వముచే మతమునకు ఊడగము చేయించిరి (పింగళి లక్ష్మీకాంతం). భాషా ప్రయోగంలో వీరు చాలా స్వతంత్ర ధోరణి అవలంబించారు. ఛందీ వ్యాకణాది నియమాలను ఉల్లంఘించడానికి, అన్యభాషాపదాలను వాడడానికి శివకవులు ఏమాత్రం వెనుకాడలేదు. వారి భక్తిపారవశ్యం ఇతర విషయాలపట్ల దృష్టిని పెట్టనీయలేదు. '''జాను కవిత''' , '''దేశి రచన''' అనే సంప్రదాయాభిమానం కలిగించింది శివకవులే. చాలా ముఖ్యమైన మత గ్రంధాలను వీరు తెలుగులో వ్రాయడం వలన ఇతర భాషలలో పండితులు కూడా తెలుగు కావ్యాలు చదివేలా చేశారు.<ref name="pingali"> పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
 
==ఇవి కూడా చూడండి==