సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
 
 
==శ్రీవిద్యా రహస్యాలు, మంత్ర శాస్త్రం==
శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. [[శ్రీవిద్య]] అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు (1) దేవీ ధ్యానము (2) శ్రీచక్ర పూజ (3) శాక్త సిద్ధాంత అధ్యయనము. ఈ మూడింటినీ కలిపి '''శ్రీవిద్య''' అంటారు. <ref name="dvr"/> వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా [[లలితా సహస్రనామ స్తోత్రము]] పారాయణము, [[శ్రీచక్రార్చన]], [[షోడశాక్షరీ మంత్రము]] అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సమయాచారము" అనె రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.
 
 
మిగిలిన అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నదని దర్శన సాహిత్య కర్తల అభిప్రాయము. కామేశ్వర సూరి ఈ శ్లోకాన్ని శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా వ్యాఖ్యానించాడు. అవి (1) వేదాంతము (2) సాంఖ్యము (3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత (4) సార్ధకములైన శబ్దములు (5) వాని అర్ధము (6) శబ్దముల సృష్టి (7) యంత్రము (8) ప్రణవము (9) మాతృక (సంస్కృతాక్షరమాల) (10) కాది విద్య (11) హాదివిద్య (!2) పంచాక్షరి (13) దీక్షనిచ్చు గురువు (14) చంద్రకళ <ref name="dvr"/>. ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు.
 
ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు మరియు బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.
 
==గాధలు==
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు