నేదురుమల్లి జనార్ధనరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==రాజకీయ ప్రస్థానం==
[[1972]]లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) కార్యదర్శిగా నియమించబడ్డాడు. [[1978]]లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో పదవి కూడా పొందినాడు. [[1983]]లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ఆ పదవిలో ఉన్నాడు. [[1988]]లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1989]]లో మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిమండలిలో చోటు సంపాదించాడు. మర్రిచెన్నారెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు జనార్దనరెడ్డి చేపట్టినాడు. 1992లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉండి, 1998లో 12వ లోకసభకు ఎన్నికయ్యాడు. 1999లో 13వ లోకసభము మళ్ళీ ఎన్నికయ్యాడు. ఈ కాలంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించాడు. 2004లో 14వ లోకసభకు విశాఖపట్టణం నియోజకవర్గం నుండి ఎన్నికై మూడవసారి లోకసభకు వెళ్ళినాడు. ఇదివరకు తన స్వంత నియోజకవర్గం రిజర్వ్‌డ్‌గా ఉండటంతో నెల్లూరు నుండి పోటీచేయడానికి వీలులేకపోగా, తాజాగా పునర్విభజనలో జనరల్ స్థానంగా మారిన నెల్లూరు నుండి పోటీచేయాలని తలచిననూ జనార్దనరెడ్డికి సీటి లభించలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళవలసి వచ్చింది.
 
==ముఖ్యమంత్రిగా==