బాబూ రాజేంద్ర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== స్వాతంత్ర్య సమరంలో ==
న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు.[[1918]] లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత'దేశ్'అనే హిందీ పత్రికనూనడిపాడు.[[1921]] లో [[మహాత్మా గాంధీ]] తో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు.పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్‌లో చేర్చాడు. ఈ విద్యాపీఠాన్ని[[1921]] లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. [[1924]] లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. [[జనవరి 15]], [[1934]] న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.
 
రాజేంద్రప్రసాద్ [[1934]] అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే [[1939]] లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, [[1947]] లో ఇంకోసారి మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు.
 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్ర్యంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి [[1962]] న పదవీ విరమణ చేసాడు.హిందీ,సంస్కృతం,ఉర్దూ,పర్షియన్,ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేన్ద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ,ఇండియా డివైడెడ్,ఆత్మకథ,ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.