నేనో తెలుగువాడిని,తెలుగు అభిమానిని.తెలుగువాడికి తెలుగుపై అభిమానం ఉండటంలో తప్పులేదు,లేకపోతేనే తప్పు.ఏదో సృష్టించాలనో మరేదో ఉద్ధరించాలనో నేనిక్కడికి రాలేదు.ప్రమాదవశాత్తూ కాకుండా నా అదృష్టవశాత్తూ నేనిందులో ప్రవేశించడం జరిగింది,తర్వాత బాధ కలిగింది.తెలుగువారిలో తెలుగుపట్ల ఎంత అభిమానమున్నా దాన్ని ప్రకటించడంలోనే ఎన్ని ముద్రారాక్షసాలు? మొదటినుండీ నాకో సరదా,చిన్న కరపత్రం దొరికినా దానిలోని తప్పుల్ని సవరించేవాడిని.ఉద్ధరించడానికి కాదుగానీ నా సరదా తీర్చుకోవదానికే దిద్దుబాట్లు మొదలుపెట్టాను.తద్వారా నా బాధనీ కాస్త ఉపశమింపజేసుకుంటాను.