బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బిండింగణవాలేబిండిగణవాలే శ్రీనివాస అయ్యంగార్ రంగా''' (బి.ఎస్.రంగా) తెలుగు సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడు, నిర్మాత మరియు దర్శకుడు. కన్నడిగుడైన రంగా [[లైలా మజ్నూ]], [[స్త్రీ సాహసం]], [[దేవదాసు]] వంటి సినిమాలకు ఛాయాగ్రాహాకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సొంత నిర్మాణ కంపెనీ [[విక్రమ్ ప్రొడక్షన్స్]] స్థాపించి తొలి సినిమా [[మా గోపి]] ని నిర్మించాడు. ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం కూడా వహించాడు.
 
రంగా [[1917]], [[నవంబర్ 11]]న అప్పటి మైసూరు రాజ్యంలోని [[బెంగుళూరు]] సమీపములోని మగడి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి కళలు, కళాకారుల మధ్య పెరిగిన రంగా అనేక నాటక రంగ ప్రముఖులతో కలిసిమెలిసి తిరిగేవాడు. రంగా ఫోటోగ్రఫీని చేపట్టి అందులో కఠోర శ్రమ మరియు మొలుకువతో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. 17 ఏళ్ల లేత వయసులో స్వయంశిక్షితుడైన రంగా తన ఫోటోగ్రఫీని కొంత లండన్ లోని రాయల్ సలాన్ లో ప్రదర్శనకు గాను పంపించాడు. ఈయన రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీలో గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు