ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

2002 సినిమా
కొత్త పేజీ: ==పరిచయం== చిరంజీవి ఫ్యాక్షనిజం పై నటించిన చిత్రం. ==కథ== బాలుడిగ…
(తేడా లేదు)

06:08, 2 మే 2009 నాటి కూర్పు

పరిచయం

చిరంజీవి ఫ్యాక్షనిజం పై నటించిన చిత్రం.

కథ

బాలుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి సీమలోని ఫ్యాక్షన్ తగాదాలలో తన తండ్రిని కోల్పోతాడు. సీమని కాపాడటానికి తన తండ్రి అన్నదమ్ములలో ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో బాల్యదశలోనే ఇంద్ర తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు.

కొన్నేళ్ళ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ కాశీలో గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక ముత్యాల హారం దొరుకుతుంది. కాశీలో తన కూతురు పల్లవికి సంగీతం నేర్పించాలని గవర్నరు చెన్న కేశవ రెడ్డి తన కుటుంబంతో సహా గంగలో మునకలు వేస్తుండగా పల్లవి మెడలోంచి జారిన హారమే అది. శంకర్ మేనకోడలు నందిని క్లాస్ మేట్ గా పల్లవి చేరుతుంది. తన మామ మెడలో హారాన్ని చూసిన పల్లవి వారి ఇంటిలోనే ఉంటూ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కాలేజీ హాస్టల్ లో కాక ఒక ట్యాక్సీ డ్రైవర్ ఇంటిలో తన కూతురు ఉంటుందని తెలుసుకొన్న చెన్న కేశవ రెడ్డి భద్రతా సిబ్బంది తో సహా శంకర్ ఇంటిని చుట్టుముడతారు. శంకర్ ని చూసిన చెన్న కేశవ రెడ్డి చేతులెత్తి అతనికి నమస్కరిస్తాడు.

లాంచీ డ్రైవర్ అయిన గిరి నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి వివాహం జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్.

మూగవాడుగా ఉన్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది.