వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==ఇటీవలి పరిణామాలు==
మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ మతపరంగా ఉద్రేక ప్రసంగాలు చేసినట్లు ప్రచారం కావడంతో ఎన్నికల కమీషన్ వరుణ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇది రాజకీయంగా తనను ఇరకాటంలో పెట్టేందుకు కుట్రమాత్రమేనని, తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేనని, దీనికి సంబంధించి ఎటువంటి క్షమాపణలు చెప్పే ప్రశక్తే లేదని స్పష్టం చేశాడు. పిలిభిత్‌లో హిందువులు భయంతో బతుకున్నారు. ఓ బ్లాకులో మూడు ఆలయాలను ధ్వంసం చేశారు. అందువలనే ఈ వర్గ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలనుకున్నట్లు చెప్పినాడు.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318029_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> ఈ విషయంలో పరిస్థితి విషమించడంతో ముందస్తు బెయిల్‌కై ప్రయత్నించగా ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేసింది. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/20/1090320021_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 20-03-2009]</ref> వరుణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందు వెనుకంజ వేసి తర్వాత వరుణ్ తప్పు లేనట్లు ప్రకటించింది. ప్రారంభంలో భాజపా నాయకత్వం వరుణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.<ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/17/1090317007_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 17-03-2009]</ref> ఈ విషయంలో [[శివసేన పార్టీ]] అధినేత [[బాల్ థాకరే]] ఒక అడుగు ముందు వేసి వరుణ్ గాంధీ మాటలలో తప్పేమీ లేదని ప్రకటించాడు. <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/18/1090318031_1.htm యాహూ తెలుగు వార్తలు తేది 18-03-2009]</ref> [[విశ్వ హిందూ పరిషత్తు]] కూడా వరుణ్ గాంధీని సమర్థించింది.<ref>[http://www.hindu.com/2009/03/27/stories/2009032751730300.htm హిందూ ఆన్‌లైన్ ఎడిషన్ తేది 27-03-2009]</ref> తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను తొలిగించాలని వరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాదు హైకోర్టు తోసిపుచ్చింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> <ref>[http://in.telugu.yahoo.com/News/National/0903/25/1090325023_1.htm యాహూ తెలుగు వార్తలు తేది. 25-03-2009]</ref> ముందస్తు బెయిల్ గడుపు ముగయడంతో మార్చి 28, 2009న పిలిభిత్ స్థానిక కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోయాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> 19 రోజులపాటిరోజులపాటు ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జైలులో గడిపిన వరుణ్ గాంధీ [[ఏప్రిల్ 16]]న పెరోల్‌పై విడుదల అయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-04-2009</ref>
 
==వరుణ్ హత్యకు కుట్ర==
వరుణ్ గాంధీని హత్య చేయడానికి ఛోటాషకీల్ అనుచరుడు కుట్రపన్నినట్లు మార్చి మూడవవారంలో నిఘా అధికారులు పసిగట్టిన ఫోన్ సంభాషణల ద్వారా బయటపడింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 05.04.2009</ref> మార్చి 27న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వరుణ్‌పై దాడిజరిగే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. మార్చి 28న వరుణ్ గాంధీ ఢిల్లీ నుంచి ఫిలిబిత్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ హత్యచేయడానికి వేసిన పథకం విఫలమైంది.
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు