రుద్రవీణ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring =[[చిరంజీవి]],<br>[[శోభన]]|
}}
==కథ==
సంగీత ప్రావీణ్యుడైన గణపతి శాస్త్రి[[జెమిని గణేశన్]] కి గౌరవప్రదమైన బిళహరి బిరుదు ఉంటుంది. గణపతి శాస్త్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు [[ప్రసాద్ బాబు]] మూగవాడు, కానీ సన్నాయి నాదంలో దిట్ట. చిన్న కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి [[చిరంజీవి]] తండ్రి వద్దే సంగీతంలో శిక్షణ పొందుతున్నా అభినవ భావాలు గల వ్యక్తి. కుమార్తె తంబూరా వాయిద్యంలో ప్రావీణ్యురాలు.
 
ఒకరోజు తండ్రితో కలిసి సాధన చేస్తున్న సూర్యానికి తలుపు వద్ద ఒక స్త్ర్రీ భిక్షాటన వినిపిస్తుంది. ఆ భిక్షాటన తో ఏకాగ్రతని కోల్పోయిన సూర్యాన్ని మందలిస్తాడు గణపతి శాస్త్రి. తరువాత జరిగే సంగీత కచేరీలో "మానవ సేవే మాధవ సేవ" అని అర్థం వచ్చేలా సూర్యం పాడటంతో తనని శిష్యునిగా ధిక్కరిస్తాడు గణపతి శాస్త్రి. చారుకేశ [[రమేష్ అరవింద్]] అనే మరో యువకుడిని శిష్యునిగా స్వీకరిస్తాడు. తండ్రి ధిక్కరింపుకు గురి అయిన సూర్యం, తమ కంటే తక్కువ సామాజిక వర్గానికి చెందిన లలిత ([[శోభన]]) ఇంటిలో తలదాచుకొంటాడు.
 
చారుకేశ తన కూతురినే ప్రేమించటం హర్షించిన గణపతి శాస్త్రిని వరకట్నంగా తన బిళహరి బిరుదుని ఇవ్వమంటాడు. చేసేది లేక ఇచ్చిన గణపతి శాస్త్రికి చారుకేశ అసలు బ్రాహ్మణుడే కాదని తెలుస్తుంది.
 
ఇల్లు వదలి సమాజసేవ బాటని పట్టిన సూర్యం సంఘ సంక్షేమ ప్రయత్నాలని గుర్తించి ప్రధాన మంత్రి అతనిని సత్కరించటానికి వస్తున్నాడని గణపతి శాస్త్రికి తెలుస్తుంది. ఆ సభలో కుమారుడిని దగ్గర నుండి చూడాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవటం గమనించిన సూర్యం అతను తన తండ్రి అని, సభా వేదిక పై అతనిని తీసుకు వచ్చి, తండ్రిగా అతనిని సత్కరించటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
 
==పాటలు==
*తరలి రాదా తనే వసంతం... తన దరికిరాని వనాలకోసం - గానం: [[బాలు]], రచన: [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/రుద్రవీణ_(సినిమా)" నుండి వెలికితీశారు