డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
డి.కె.అరుణ [[1960]], [[మే 4]]న మహబూబ్ నగర్ జిల్లా [[ధన్వాడ]]లో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు [[నారాయణపేట]]లో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త డి.కె.భరతసింహారెడ్డి, మామ డి.కె.సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
==రాజకీయ జీవితం==
డి.కె.అరుణ [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున పోటీచేసి ఓడిపోయింది. [[1998]]లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందినది. ఆ అనంతరం [[1999]]లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసిననూ విజయం దక్కలేదు. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం.2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినది. గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం.
డి.కె.అరుణ [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున పోటీచేసి ఓడిపోయింది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు