వైఎస్‌ఆర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
* ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత [[ముగ్గురాయి]] ([[బెరైటీస్]]) [[మంగంపేట]] గనుల్లో లభిస్తోంది. [[పులివెందుల]] ప్రాంతంలో [[రాతినార]] తీస్తున్నారు. [[నాప రాళ్ళు|నాప రాళ్ళ]]కు కడప పెట్టింది పేరు. [[యర్రగుంట్ల]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమ]] విస్తరిస్తోంది. [[ముద్దనూరు]] దగ్గర ఏర్పాటైన [[ఆర్.టి.పి.పి.|రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు]] మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది.
 
* రవాణా సౌకర్యాలు: బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటైన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్యపట్టణమైన ప్రొద్దటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణదశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు స్టేట్ హైవేలు. నెల్లూరు-బళ్ళారి లను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.
 
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, [[ఎర్రచందనం|చందన వృక్షాలు]], వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వైఎస్‌ఆర్_జిల్లా" నుండి వెలికితీశారు