జయమ్ము నిశ్చయమ్మురా (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ + కొంచెం విస్తరణ
సంక్షిప్త కధ
పంక్తి 7:
production_company = [[సుదర్శన్ పిక్చర్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[రాజేంద్రప్రసాద్]] (రాముడు),
[[సుమలత]] (శాంతి),
[[చంద్రమోహన్]] (సూరిబాబు),

[[అవంతి]] (సీత),
[[కోట శ్రీనివాసరావు]],
[[సుత్తివేలు]] (జగన్),
[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] (రంగనాధం),
[[బ్రహ్మానందం]] (గోపాలం),
[[శ్రీలక్ష్మి]] (కాంతం),
[[రాధాబాయి]] (సుబ్బులు),
అశొక్ రావు|

|story = ఆదివిష్ణు
|screenplay = జంధ్యాల
Line 24 ⟶ 23:
|editing = గౌతంరాజు
|production_company = సుదర్శన్ పిక్చర్స్
| imdb_id=0249617}}

'''జయమ్ము నిశ్చయమ్మురా''', 1989లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. చిత్ర విచిత్రాలైన పాత్రలు సృష్టించి ప్రేక్షకులకు నవ్వు అనే యోగాన్ని అందించడంల సిద్ధహస్తుడైన జంధ్యాల, హాస్యపాత్రల హీరోగా విశిష్టమైన గుర్తింపు తెచ్చుకొన్న రాజేంద్ర ప్రసాద్‌ల కాంబినేషన్లో వెలువడిన ఈ సినిమా బాగా విజయవంతమైన హాస్యచిత్రాలలో ఒకటి.

[[శ్రీవారికి ప్రేమలేఖ]], [[నాలుగు స్తంభాలాట]] వంటి సినిమాలలో హాస్యయుతమైన క్యారెక్టర్లను సృష్టించి ఆ పాత్రల డైలాగులను తెలుగు భాష నుడికారంలో భాగంగా చేసిన జంధ్యాల ఈ సినిమాలో అదే ఒరవడిని కొనసాగించాడు.

రాముడు (రాజేంద్ర ప్రసాద్), సూరిబాబు (చంద్రమోహన్)లు చేతనైనంతలో ప్రేమజంటలకు వివాహాలు జరిపించడమే తమ సేవా కార్యక్రమంగా పెట్టుకొన్నారు. కాని వారి ప్రేమకధలలకు మాత్రం అనేక అడ్డంకులు ఎదురవుతాయి. సూరిబాబు ప్రేమించిన సీత (అవంతి) మాత్రం తన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలూ (తమ్ముడి ఉద్యోగం, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తల్లి వైద్యం) వంటి అనేక సమస్యలు పరిష్కారమయ్యేదాకా (ఆరు నూరైనా నురు ఆరైనా) పెళ్ళి చేసుకొనని సందు దొరికినప్పుడెల్లా శపధం చేసేస్తుంటుంది. రాముడు ప్రేమించిన శాంతి (సుమలత) ఏమో తన తల్లిదండ్రులు కుదిర్చిన పెండ్లి మాత్రం సంప్రదాయబద్ధంగా చేసుకొంటానని భీష్మించుకొంటుంది. శాంతి తండ్రి (నూతన్ ప్రసాద్) మిలిటరీ ఆఫీసర్ స్టైల్లో అందరినీ క్షుణ్ణంగా పరిశీలించందే నిర్ణయించుకోడు. అతని కుక్క (పేరు హిట్లర్) వాళ్ళ ఇంట్లో తిని పక్కింట్లో మొరుగుతుంది. అతని భార్య వారానికి ఏడురోజులు మౌనవ్రతంలో ఉంటుంది. సూరిబాబు తండ్రి (కోట శ్రీనివాసరావు) పైసాపైసా కూడబెట్టి మద్రాసువెళ్ళి గొప్ప "సైన్మ" తీయాలని సంకల్పించుకొన్నాడు. కనుక తనింట్లో ఎవరైనా అతిధులు కాఫీ త్రాగితే కూడా వారికి వెంటనే బిల్లు ఇస్తుంటాడు. ఛాన్సు దొరికినప్పుడెల్లా దొరికినవారికి సినిమా కధలు వినిపిస్తుంటాడు.

ఇలా సినిమాలో ఇంకా అనేక పాత్రలు హాస్యానికి తమవంతు పుష్టి అందిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో శాంతి తండ్రిని మెప్పించి, ఒప్పించి, వారితోనే తనకు
శాంతికి పెండ్లి కుదిరేలా చేస్తానని రాముడు శాంతితో ఛాలెంజి చేస్తాడు. అలా జరగనివ్వనని శాంతి ఎదురు ఛాలెంజి చేస్తుంది. ఇద్దరూ తమ తమ పంతాలు నెగ్గించుకోడానికి చేసే ప్రయత్నాలే సినిమా కధలొ ప్రధాన ఇతివృత్తం.

==పాటలు==

==మూలాలు==
| imdb_id=0249617}}
{{మూలాలజాబితా}}