అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్ల వికీ లింకు
కొంచెం విస్తరణ
పంక్తి 22:
 
మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. బాల చందర్ దర్శకత్వం, కధన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి (అప్పుడే జయప్రద రంగంలో వస్తున్నది).
 
 
 
==సినిమా కథ==
 
సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబం జీవనానికి ఏకైక ఆర్ధిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న (రజనీకాంత్) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.
 
 
సరితను ప్రేమిస్తున్న తిలక్ (?) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కాని కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరి పెళ్ళీ చేస్తుంది.
 
 
సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు "ఫటాఫట్" జయలక్ష్మి జీవితాన్ని తేలికగా తీసుకొనే టైపు. సాంఘికమైన కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు తలపడుతుంది. ఆమెను రక్షించి సరిత ఆమె పెళ్ళి వికటకవి గోపాల్‌తో చేస్తుంది.
 
ఒక సంఘటనలో సరిత అన్న కూడా మారి పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ (కమల్ హాసన్) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక తన బాధ్యతలు అన్నకిచ్చి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొంది. అందరికీ శుభలేఖలు పంచింది. సరిత పెళ్ళికి అంతా సిద్ధమైంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడ్డాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిసింది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు(కమల్ హాసన్)తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు తను ఉద్యోగానికి ఎప్పుడూ వెళ్ళే సిటీబస్సులో బయలుదేరింది.
 
==సినిమా చిత్రీకరణ==
 
ఈ సినిమా పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరింపబడింది. సినిమాలో అనేక పాత్రల చిత్రీకరణను సున్నితంగా మలచడంలో బాలచందర్ అద్భుతమైన ప్రతిభ స్పష్టంగా గమనించవచ్చును. సినిమాలో "మాస్‌" అనబడే విషయాలు ఏమీ లేవు. పెద్ద సెట్టింగులు లేవు. ఫైట్లు లేవు. డ్యూయట్లు లేవు. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీర-విలన్ మూసల్లోకి రావు. అయినా సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.
 
 
 
Line 48 ⟶ 67:
* రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకు నాటింది.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
==బయటి లింకులు==
* [http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_antulenikatha1976.php సినిమా గురించి సమీక్ష]
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు