చి సత్యాగారి చర్చాపుటలో వ్రాసిన వ్యాఖ్యలు నా చర్చా పుటలోకి కాపీ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
 
:సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 12:08, 6 జూన్ 2009 (UTC)
 
==శివ గారి ఫిర్యాదుకు నా సమాధానం==
ఇది చాలా చిన్న విషయం. చిలికి చిలికి గాలివాన చేశారు. ఇందులో ఇరుపక్షాలకూ బాధ్యత ఉంది అని నేను భావిస్తున్నాను. శివ గారు సగటు మనిషి బొమ్మను అప్లోడు చేసి ఉత్సాహంతో దాన్ని ఈ వారం బొమ్మ మూస తొడిగి వరుసలో ఉంచారు. అది హఠాత్తుగా అక్కడ చేరటం సాంప్రదాయనికి విరుద్ధంగా ఉంది అని చంద్రకాంతరావు గారు దాన్ని తొలగించి, అందుకు కారణాన్ని వివరిస్తూ శివ గారి సభ్యుల పేజీలో [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb&diff=next&oldid=396395 వ్యాఖ్యను] వ్రాశారు. దాన్ని ఈ దిద్దుబాటు లింకులో చూపినట్టు దాన్ని శివగారు అనవసర వ్యాఖ్యగా దిద్దుబాటు మార్పులో వ్రాసి తొలగించారు. అది శివగారు తొలగించాల్సింది కాదు. అది తొలగించినా అనవసర వ్యాఖ్యగా కొట్టివేయాల్సిన అవసరం అసలు లేదు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయంపై ఆయనకు జవాబిస్తూ వ్రాసినట్టూ, మనల్ని విమర్శించడం, మన వ్రాతల్ని విమర్శించడం చాలా భిన్నమైన విషయాలు. ఎదుటి వ్యక్తి మంచిమనసుతోనే ఏదైనా మార్పు చేశాడని భావించడం వికీ మర్యాదల్లో ఒకటి. అది శివగారికి తెలుసో, తెలియకో ఉల్లంఘించారు. కానీ ఆ తర్వాత చంద్రకాంతరావు గారు "ఇది సభ్యత కాదు" అన్న [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb&diff=next&oldid=397876 వ్యాఖ్యలో] శివగారిని వ్యక్తిగతంగా విమర్శించారు. ఇక్కడ చంద్రకాంతరావు గారు, శివగారికి తనపై కోపం వచ్చి ఆ వ్యాఖ్యను తొలగించారని అన్వయించి ఏకవచన ప్రయోగం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఆ తర్వాత మరోచోట ఏకవచన ప్రయోగం అగౌరపూర్వకం కాదని సమర్ధించుకున్నారు. కానీ అదే వ్యాఖ్యలో కావాలనే ఏకవచన ప్రయోగం ఉపయోగించినట్టు ఆయనే ఒప్పుకున్నారు.[http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B5%E0%B1%88%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF&diff=prev&oldid=405901]. ఇక్కడ మళ్లీ లక్షన్నొక్కసారి మనవి చేసుకునేదేవిటంటే వికీ అప్రత్యక్ష మాధ్యమం. అవతలి వారి అంతరంగాన్ని ఇక్కడ చర్చా పేజీల వ్రాతల్లో చాలామటుకు పట్టలేం కాబట్టి వీలైనంత ఎదుటి వారికి బెనిఫిట్ ఆఫ్ డౌటివ్వాలి. చంద్రకాంతరావు గారికి ఈ విషయం తెలుసనే నేను భావిస్తున్నాను. కానీ దీన్ని విస్మరించడం శోచనీయం. దీన్ని ఇంతటితో శివగారు కూడా ఆపలేదు. ఆయనా చంద్రకాంతరావు గారి మీద పిడివాదం, కొత్త సభ్యుల దాష్టీకం అంటూ వ్యక్తిగత దాడికి దిగారు. ఇంతకంటే వివరణాత్మకంగా ఈ విషయంలో వెళ్ళటం అనవసరం అని అనుకుంటాను. శివగారు, [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B5%E0%B1%88%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF&diff=prev&oldid=404804 ఈ వ్యాఖ్యలోని ఆరవ పాయింటులో] అన్నట్టు ఇది చిన్న అభిప్రాయ భేధమే. ఇద్దరిలో ఏ ఒక్కరైనా సంయమనం పాటిస్తే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఈ ఇద్దరూ తమదైనా శైలిలో తెలుగు వికీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసినవారే. మీ ఇరువురి అవసరం తెవికీకి ఉన్నది. ఇద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకొని విబేధాల్ని మరచిపోయి అంతర్జాలంలో తెలుగు పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనందరం చేరింది ఒక తరతరాలకు నిలిచిపోయే ఒక మహోన్నత కార్యం కోసమని గుర్తుంచుకోవాలి. పెద్దపెద్ద దేశాల్లో చిన్న చిన్న సంగతులు జరుగుతూనే ఉంటాయి లైట్ తీసుకోండి బ్రదర్స్. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 05:58, 8 జూన్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vu3ktb" నుండి వెలికితీశారు