ఇది కథ కాదు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 19:
 
==సంక్షిప్త కథ==
ఒక నర్తకి (జయసుధ) తను ప్రేమించిన వ్యక్తినివ్యక్తి (శరత్ బాబు)ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన మరొక వ్యక్తి (చిరంజీవి)కి జరిగిన సంగతి చెపుతుంది. అయినా గాని అతను సిద్ధమై ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
 
 
క్రొత్త ఆఫీసులో ఒక వ్యక్తి (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. ఒక బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది. క్రొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలద్రొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దగ్గరి దాకా వెళుతుంది. ఆమె మాజీ శాడిస్టు భర్త తల్లి (అన్నపూర్ణ) మనుమడిమీద మమకారంతో జయసుధ ఇంట్లో (చిరంజీవికి తెలయకుండా) పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే భాస్‌గా వచ్చి జయసుధను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
 
 
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించాడని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "గొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఇది_కథ_కాదు" నుండి వెలికితీశారు