మాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
*Because of ego-maaya, the delusion caused by the pernicious "I", we are full of ego-mayam (permeated by ego)
==మాయేశ్వరి==
మాయేశ్వరీ మాత.దేవీ భాగవతం ఆరో స్కంధంలో సకల జగత్తుకు మూలాధారమైన శక్తే ఈ మాయేశ్వరీ మాత. హరిహరబ్రహ్మ రుద్రాదులను సయితం ఈమె సృష్టించి వారి చేత ఏయే పనులు చేయించాలో వాటిని చేయిస్తుంటుంది. ఆదిపరాశక్తి అని, సచ్చిదానంద స్వరూపిణి అని, భగవతి, మాయేశ్వరి అని కూడా ఆ మాతనంటుంటారు. చరాచర జగత్తునంతటినీ ఆడించే మాయాశక్తి ఆమె. సత్వ, రజో, తమో అనే మూడు గుణాలతో ఆవరించి ఉండే మాయ ఆ తల్లి చేతిలోని ఓ సూత్రం. ఆ సూత్రంతోనే సకల సృష్టిని బొమ్మను చేసి ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది ఆమె. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణాత్మకమైన మాయను పొంది ఉంటారు. ఆ మాయాశక్తి వల్లే అంతటి పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఒకసారి కోపంగా, మరోసారి దుఃఖపడుతూ కనిపిస్తుంటారు. మూడు గుణాలలో మొదటిదైన సత్వగుణం ఆవరించి ఉన్నప్పుడు త్రిమూర్తులు శాంతులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదే రజోగుణం ఉన్నప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తమోగుణం ఆవరించి ఉన్నప్పుడు మూఢంగా ప్రవర్తించి విషాదాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు.ఈ జగత్తంతా మాయ ఆధీనంలో ఉంటుంది . ఈ మాయాశక్తిని ప్రేరేపించే జగదాంబికను పరతత్వం అని, పరమేశ్వరి అని కూడా అంటారు.మాయాశక్తికి లోనుకాకుండా మోక్షపథం వైపు పయనించాలంటే తనలోని మాయను తొలగించమని వేడుకోవాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించినప్పుడు మనిషి చూపు తాత్కాలిక సుఖాల మీద ఉండదు. నిత్యము, నిశ్చలము అయిన మోక్షపథం వైపు ఆ చూపు ప్రసరిస్తుంది.
==జగన్నాయకి.. జగదాంబిక==
ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.జగత్తుకంతటికీ అధినాయకి.జగదాంబిక.త్రిమూర్తుల యోగదృష్టి సంయోగం వల్ల జన్మించింది ఈ శక్తి స్వరూపిణి , త్రికళ. విష్ణుమాయ.జగాన్ని సంహరించే లయకారిణి.
 
==మాయను గురించిన పాటలు==
* మాయ సంసారము తమ్ముడూ నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడూ
"https://te.wikipedia.org/wiki/మాయ" నుండి వెలికితీశారు