మాయ లో పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది పెడుతుంది. మన ఇహలోకజీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది కొరతలతోకూడినది విచారకరమైనది. గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి. మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది నేను అనే మాయలో పడి మంచి వస్తువులుకోరతాము రోగం మరణం వద్దంటాము. మహావిద్యావంతులు కూడా కోర్కెలు ఉండాలి కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు. తల్లిదండ్రుల్నిజన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ భ్రమిస్తున్నాము. అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈమూర్ఖత్వం అజ్ఞానమే మహా మాయ.

మాయనిర్వచనాలు

మార్చు
  • మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3) మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.
  • Maya :Illusion or illusory power . It is deluding to the ignorant, but emancipating in the hands of the wise. All siddhis belong to this region of Maaya. It is nothing but the dark side of God.
  • Maha Maya:This is a state Godly energy in the subtle form. This is the place from the Avatars like Lord Rama and Bhagavan Krishna came from.
  • Because of ego-maaya, the delusion caused by the pernicious "I", we are full of ego-mayam (permeated by ego)

మాయేశ్వరి

మార్చు
 
Markandeya sees Vishnu as an infant on a fig leaf in the deluge

మాయేశ్వరీ మాత.దేవీ భాగవతం ఆరో స్కంధంలో సకల జగత్తుకు మూలాధారమైన శక్తే ఈ మాయేశ్వరీ మాత. హరిహరబ్రహ్మ రుద్రాదులను సయితం ఈమె సృష్టించి వారి చేత ఏయే పనులు చేయించాలో వాటిని చేయిస్తుంటుంది. ఆదిపరాశక్తి అని, సచ్చిదానంద స్వరూపిణి అని, భగవతి, మాయేశ్వరి అని కూడా ఆ మాతనంటుంటారు. చరాచర జగత్తునంతటినీ ఆడించే మాయాశక్తి ఆమె. సత్వ, రజో, తమో అనే మూడు గుణాలతో ఆవరించి ఉండే మాయ ఆ తల్లి చేతిలోని ఓ సూత్రం. ఆ సూత్రంతోనే సకల సృష్టిని బొమ్మను చేసి ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది ఆమె. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కూడా త్రిగుణాత్మకమైన మాయను పొంది ఉంటారు. ఆ మాయాశక్తి వల్లే అంతటి పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఒకసారి కోపంగా, మరోసారి దుఃఖపడుతూ కనిపిస్తుంటారు. మూడు గుణాలలో మొదటిదైన సత్వగుణం ఆవరించి ఉన్నప్పుడు త్రిమూర్తులు శాంతులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదే రజోగుణం ఉన్నప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తమోగుణం ఆవరించి ఉన్నప్పుడు మూఢంగా ప్రవర్తించి విషాదాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు.ఈ జగత్తంతా మాయ ఆధీనంలో ఉంటుంది . ఈ మాయాశక్తిని ప్రేరేపించే జగదాంబికను పరతత్వం అని, పరమేశ్వరి అని కూడా అంటారు.మాయాశక్తికి లోనుకాకుండా మోక్షపథం వైపు పయనించాలంటే తనలోని మాయను తొలగించమని వేడుకోవాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించినప్పుడు మనిషి చూపు తాత్కాలిక సుఖాల మీద ఉండదు. నిత్యము, నిశ్చలము అయిన మోక్షపథం వైపు ఆ చూపు ప్రసరిస్తుంది.

జగన్నాయకి - జగదాంబిక

మార్చు

ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.జగత్తుకంతటికీ అధినాయకి.జగదాంబిక.త్రిమూర్తుల యోగదృష్టి సంయోగం వల్ల జన్మించింది ఈ శక్తి స్వరూపిణి, త్రికళ. విష్ణుమాయ.జగాన్ని సంహరించే లయకారిణి.

మాయను గురించిన పాటలు

మార్చు
  • మాయ సంసారము తమ్ముడూ నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడూ

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాయ&oldid=4343607" నుండి వెలికితీశారు