టెల్ మీ యువర్ డ్రీమ్స్: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల లింకుని చేర్చాను
→‎కథ సారాంశం: సిడ్నీ షెల్డన్ ని లింకుగా మార్చాను
పంక్తి 28:
ఒంటరిగా నివసిస్తున్న తనని ఎవరో వెంబడిస్తున్నారు అని యాష్లీ అనుమాన పడుతుండటం (Somebody was following her అన్న వాక్యం) తో కథ మొదలవుతుంది. తను ఆఫీసు నుండి వచ్చిన సమయానికి ఎవరో తన ఇంటిలోని దీపాలని వెలిగించి ఉంచటం వలన తనకి ఆ అనుమానం కలుగుతుంది. తాను స్నానం చేస్తున్న సమయంలో తన పడక గదిలో అలికిడి కాగా, వెళ్ళి చూడగా, తన లోదుస్తులన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటంతో తనను వెంబడించేవాడు మానసిక రోగిగా అనుమాన పడుతుంది. అద్దం పైన "నువ్వు చచ్చిపోతావు" (You will die) అని ఎవరో తన లిప్ స్టిక్ తోనే రాయడంతో తాను ఇంకా కలవరపడుతుంది. తన చిన్ననాటి ప్రేమికుడి మోసానికి గురైన యాష్లీ పోలీసులకి ఫిర్యాదు చేయటంతో ఆమెకి రక్షణ గా ఒక పోలీసు అధికారి నియమింపబడతాడు. ఆ రాత్రి 12.00 గంటల సమయంలో ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టు వినిపించిన యాష్లీ ఆ పోలీసు అధికారి నిద్రిస్తున్న గదికి వెళ్ళగా దారుణంగా హత్యకి గురైన ఆ అధికారిని చూసి నివ్వెరపోతుంది. ఆ విధంగానే అనుమానాస్పద పరిస్థితులలో అదివరకే ఇద్దరు పురుషులు (యాష్లీ మాజీ ప్రియుడు, యాలెట్ చిత్రాలని విమర్శించిన ఓ చిత్రకారుడు) హతమార్చబడి ఉంటారు. హతులు ముగ్గురూ సంభోగ సమయంలోనే హత్యకి గురవ్వటంతో బాటు, వారి వృషణాలు కోసివేయబడి ఉంటాయి. వీరి తర్వాత టోనీ ప్రియుడు కూడా ఇదే విధంగా హత్యకి గురవుతాడు. హత్య జరిగిన ప్రదేశాలలో దొరికిన వెంట్రుకలు, సంభోగ సమయంలో స్త్రీ శరీరం లో స్రవించే ద్రవాల నమూనాలని బట్టి ఒకే యువతి అన్ని హత్యలనీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తారు. ప్రియుడు టోనీ కి ఇచ్చిన బహుమతి ఒకటి యాష్లీ వద్ద పోలీసులకి దొరుకుతుంది. యాష్లీని అరెస్టు చేసిన పోలీసులు, తాను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (Multiple Personality Disorder - MPD) అనబడు ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలని తెలుసుకొంటారు.
 
యాష్లీ తండ్రి తనకి బాగా పరిచయం ఉన్న న్యాయవాదిని తన కుమార్తె కేసును వాదించమని కోరతాడు. అసలు MPD ఉందా, లేదా అన్న న్యాయవాదుల వాదప్రతివాదాల తో రెండవ భాగం నడుస్తుంది. మానసిక శాస్త్రవేత్తల సహకారంతో యాష్లీ తరపు న్యాయవాది టోనీ ని పరిచయం చేయటంతో న్యాయస్థానం MPD ని నమ్మి యాష్లీని నిర్దోషిగా తీర్పు చెబుతుంది. బాల్యంలోని చెడు అనుభవాల వలన ముక్కలైన యాష్లీ హృదయానికి మానసిక చికిత్స చేయిస్తుంది న్యాయస్థానం. సొంత తండ్రి తనని పలుమార్లు బలాత్కరించటం వలన, అందుకే తన తల్లి ఛీత్కారాలకి గురి అయిన తన తండ్రి పైన ఏర్పరుచుకొన్న ద్వేషం, పురుష జాతి మొత్తం పై విస్తరించుకోవటంతో యాష్లీలో మహా సిగ్గరి, మహా తిరుగుబోతు అయిన రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు జన్మిస్తాయి. [[సిడ్నీ షెల్డన్]] ఇతర నవలల వలెనే ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగి ఇది కూడా అత్యాశ్చర్యకరంగా ముగుస్తుంది.
 
==విశేషాలు==