సంధ్యాసమయం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar, arc, bat-smg, bs, ca, da, de, el, eo, es, et, fi, fr, gl, hr, hu, it, ja, ko, lt, mk, nl, nn, no, oc, pl, pt, ro, ru, sco, simple, sk, sl, sr, th, tr, uk, zh
→‎అసుర సంధ్య: బొమ్మ చేర్చాను
పంక్తి 9:
 
 
==అసుర సంధ్య==
 
[[ఫైలు:Godhuli, Mewar, ca1813.jpg|right|thumb|200px|గోధూళి వేళ - 1813నాటి మేవార్ శైలి చిత్రం]]
హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు.
[[పగలు|పగటికి]] [[రాత్రి]]కి సంధి [[కాలమే]] సంధ్యా సమయం. సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమ[[శివుడు]] [[పార్వతి|పార్వతీ]] సమేతంగా [[కైలాసం]]లో తాండవం చేస్తాడు. కైలాసమందలి [[ప్రమథ గణములు]], భూతకోటి శివ నామాన్ని ఉచ్చరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. ముప్పది మూడు కోట్ల దేవతలు, [[బ్రహ్మ]] [[విష్ణువు]]లు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వం తో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి, నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
 
 
==కల్పాంత సంధ్య==
"https://te.wikipedia.org/wiki/సంధ్యాసమయం" నుండి వెలికితీశారు