బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
===యుగ ధర్మములు===
కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.
 
 
త్రేతాయుగంలో జనులకు రజోగుణము ప్రధానముగా ఉంటుంది. వర్షములు పుష్కలముగా కురియును. జనులు సత్యమును తప్పరు. వారిలో క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేర్పడును. మానవులలో హర్షము, ద్వేషము వంటి ద్వంద్వగుణములు రూపుదిద్దుకొనును. స్త్రీపురుషులకు భోగేచ్ఛ అధికమగును. తపస్సు పట్ల బద్ధకము పెరుగును. వ్యాపారమునందు ఆసక్తి పెరుగును. గ్రామములు, పట్టణములు ఏర్పడును. కొలతలు ఇతర ప్రమాణములు ఏర్పడును. పెక్కు ధాన్యములు లభించును. వృత్తుల ప్రాధాన్యత పెరుగును.
 
 
ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధణముపట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.
 
కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిధి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.
 
===రాక్షసులు సూర్యుని అడ్డగించుట===
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు