తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
చి యంత్రము కలుపుతున్నది: ur:تیلنگانا; cosmetic changes
పంక్తి 2:
 
 
[[బొమ్మఫైలు:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుగు రంగుతో సూచించబడినది)]]
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు విభాగాలనూ [[కోస్తా]] ఆంధ్ర (లేదా [[ఆంధ్ర]] లేదా [[సర్కారు ]] ) [[రాయలసీమ]] అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది.
ప్రస్తుత తెలంగాణా ప్రాంతము [[నిజాం]] తన రాజ్యంలోని ప్రాంతములను రక రకాల కారణములతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము.
 
== భౌగోళిక స్వరూపం ==
ఈ ప్రాంతము [[దక్కను పీఠభూమి]]పై, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది.
 
== జిల్లాలు ==
ప్రస్తుత తెలంగాణా ప్రాంతమునందు, [[ఖమ్మం జిల్లా |ఖమ్మం]], [[మహబూబ్ నగర్]], [[నల్గొండ]], [[రంగారెడ్డి]], [[వరంగల్]], [[కరీంనగర్]], [[నిజామాబాదు]], [[అదిలాబాదు]], [[మెదక్]] , [[హైదరాబాదు]] అను జిల్లాలు కలవు.
[[ఫైలు:Telangana Districts.jpg|thumb|తెలంగాణా జిల్లాలు]]
== భౌగోళిక మార్పులు ==
స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే చూపించబడుతున్నది.
 
== చరిత్ర ==
{{seemain|తెలంగాణా చరిత్ర}}
ఈ ప్రాంతము మూడవ శతాబ్దంలో [[శాతవాహనులు]], తరువాత [[కాకతీయులు]], తరువాత [[బహుమనీ సుల్తానులు]], [[గోల్కొండ]] సుల్తానులు, మొఘలు పరిపాలకులు, [[నిజాం]] సుల్తానులు పరిపాలించినారు.
:భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చు నాటికి ఈ ప్రాంతము నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత [[తెలంగాణా పోలీసు చర్య]] ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలపబడినది, ఈ పోరాటంలో [[తెలంగాణా సాయుధ పోరాటం]]నాటి [[రజాకార్ల]] దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. తరువాత [[1956]]లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడు వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించినది.
 
== ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు ==
 
హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక [[పెద్దమనుషుల ఒప్పందం|ఒప్పందం]] కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.
పంక్తి 28:
 
 
=== మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ===
{{seemain|మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము}}
 
=== రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ===
{{seemain|రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము}}
{{తెలంగాణామూస}}
తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక '''తెలంగాణా''' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. '''రెండవ''' అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి ''రెండవ'' అనే పదం వాడవచ్చు.
 
 
పంక్తి 47:
 
ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది.
== కోస్తా ఆంధ్రుల భయాలు ==
*పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.
== తెలంగాణా వాదుల వాదనలు ==
*ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
 
== సంస్కృతి ==
ఈ ప్రాంతమున ముఖ్యముగా తెలుగు మాట్లాడు హిందూ మతస్తులు కలరు, ఉర్దూ మాట్లాడు ముస్లిం ప్రజలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యముగా హైదరాబాదు పాత బస్తీ ప్రాంతమునందు.
 
== లింకులు ==
*[http://discover-telangana.org డిస్కవర్ తెలంగాణా] - తెలంగాణా సంబంధిత విషయాలపై ఒక బ్లాగు పోర్టల్
 
పంక్తి 67:
[[mr:तेलंगाणा]]
[[sv:Telangana]]
[[ur:تیلنگانا]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు