"నాగం జనార్ధన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[నాగం జనార్ధన్ రెడ్డి]] [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన నాయకుడు. [[మే 22]], [[1948]]న జన్మించాడు. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా [[నాగర్ కర్నూల్]] మండలంలోని నాగపూర్ ఒక కుగ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది.
 
వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత [[ఉస్మానియా వైద్య కళాశాల]]లో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో [[తెలంగాణా ఉద్యమం]] ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:1948 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/460993" నుండి వెలికితీశారు