"మహాత్మా గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

(బొమ్మ చేర్చాను)
 
== చివరి రోజులు ==
[[ఫైలు:LAST PHOTO.JPG|leftright|300pix|thumb|గాంధీ చివరి ఫొటో]]
స్వాతంత్ర్యానంతరం గాంధీగారి ప్రయత్నాలు హిందూ-ముస్లిమ్ విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీగారిపై బదింది. దేశవిభజనతో, ముఖ్యంగా పంజాబు, బెంగాలులలో, పెద్దయెత్తుగా సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో [[జమ్మూ కాశ్మీరు|కాశ్మీరు]] విషయమై భారత్ - [[పాకిస్తాన్]] యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ [[పాకిస్తాను]] పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అబిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్దానికి దారితీస్తుందనీ గాంధీగారి అభిప్రాయం.ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశాడు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించారు.కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీగారి పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నారని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.
 
1948 జనవరి 20న గాడ్సే అతని బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం ఛేసారు. అందులో వారి అనుచరుడు మదన్ లాల్ అరెస్టయినాడు.ఈ విషయం గాంధీ కు తెలిసిన మీదట, మదన్ లాల్ ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. ఆయన మాటల్లొనే ఆయన ప్రతిస్పందన- "పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పొయ్యక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని".
 
=== గాంధీ హత్య ===
[[ఫైలు:Raj ghat.jpg|right|500pix|thumb|[[రాజ్ ఘాట్]]]]
=== గాంధీ హత్య ===
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ"హే రామ్" అన్నాడని చెబుతారు. ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన [[రాజ్ ఘాట్]] వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది.మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ [[జవహర్ లాల్ నెహ్రూ]] రేడియోలో అన్న మాటలు:"మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము"
 
=== గాంధీ గురించి గాడ్సే ===
[[ఫైలు:GODSEY.jpg|left|100px|thumb|గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే]]
[[ఫైలు:assasin.jpg|left|100px|thumb| గాడ్సేకు హత్యలో తోడ్పడిన నారయణ ఆప్టే]]
గాంధీని నిలదీయటానికి ఏటువంటి చట్టపరమయిన అవకాశం లేదు. నాకనిపుస్తున్నది అతను సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదని (There was no legal machinery by which [Gandhi] could be brought to book ... I felt that [he] should not be allowed to meet a natural death.)
[[ఫైలు:NEWS.jpg|right|300pix|thumb|గాంధీ హత్యోదంతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో]]
[[ఫైలు:assasin.jpg|left|100px|thumb| గాడ్సేకు హత్యలో తోడ్పడిన నారయణ ఆప్టే]]
[[ఫైలు:BODY.jpg|right|100pix|thumb|గాంధీ బౌతికకాయం]]
గాంధీని నిలదీయటానికి ఏటువంటి చట్టపరమయిన అవకాశం లేదు. నాకనిపుస్తున్నది అతను సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదని (There was no legal machinery by which [Gandhi] could be brought to book ... I felt that [he] should not be allowed to meet a natural death.)
=== గాంధీని తనెలా చంపాడో-గాడ్సేమాటలలో ===
"పిస్టల్ నా కుడి అరచేతిలోఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే 'ఆఅహ్' అని కిందపడిపొయ్యాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్! పోలీస్! అని అరవటం మొదలు పెట్టాను.నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని అవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడతమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు".
 
 
నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. అక్కడ DSP సర్దార్ జస్వంన్త్ సింగ్ మొదటి సమాచార నివేదిక (First Information Report)తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు.
 
==గాంధీజీకి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వలేదు==
అహింసా పద్ధతిలో ఆ దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చి ఉండాల్సింది.1937, 1947,1948లో మూడుసార్లు గాంధీ నామినీగా ఎంపికయినా నోబెల్‌ కమిటీ ఏవో కుంటి సాకులు చెప్పి నోబెల్‌ బహుమతి అందకుండా చేసింది.ఈ అవార్డులు చాలా మందికి ఐరోపాలోని తెల్ల జాతీయులకే అందించింది. నోబెల్ శాంతి బహుమతిని జిమ్మీ కార్టర్‌, హెన్రీ కిసింజర్ , అల్‌గోర్‌, ఒబామా కూడా ఇచ్చారు.కానీ... సామాన్యుడి చేతి కి సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించి, అహింసే పరమ ధర్మమని విశ్వసించి, మూర్తీభవించిన శాంతం గా పేరొందిన గాంధీకి మాత్రం నోబెల్ శాంతి బహుమతి రాలేదు. బాపూజీ 1948 లో మరణించారు. అంతకంటే ముందు పదకొండేళ్లలో 3సార్లు ఆయన పేరు నోబెల్ శాంతి బహుమతి కోసం పరిశీలనకు వెళ్లింది. ప్రతిసారీ ఆయనను తిరస్కరించారు. ఎందుకని ప్రశ్నిస్తే... వారు చెప్పిన కుంటిసాకులుఇవి: 'ఆయన రాజకీయ నాయకుడు కాదు. అంతర్జాతీయ చట్టాల రూపకర్త కాదు.సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అంతర్జాతీయశాంతి సం స్థలతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు.ఆయన జాతీయవాదే కానీ అంతర్జాతీయ మానవతావాది కాదు.దక్షిణాఫ్రికాలో కూడా ఆయన భారతీయుల కోసమే పోరాడాడుకానీ అంతకంటే హీనంగాఉన్న నల్లజాతీయులకోసం పోరాడలేదు.1948లో అవార్డు ఇవ్వకముందే ఆయన్ని చంపారు.చనిపోయిన వారికి అవార్డు ఇవ్వకూడదన్నారు.బతికున్న వాళ్ళలో అర్హులెవరూలేరని ఆయేడాది అవార్డునే రద్దుచేశారు.http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?CatId=336077&Categoryid=1&subCatId=32,http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/oct/11main34
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/467358" నుండి వెలికితీశారు