సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
:తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.
*
సిరి దా వచ్చిన వచ్చును
పంక్తి 68:
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
:తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.
*
మేలెంచని మాలిన్యుని
పంక్తి 74:
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
:తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.
*
సరసము విరసము కొరకే
పంక్తి 80:
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
:తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.
*
శుభముల నొందని చదువును
పంక్తి 86:
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
:తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.
*
వేసరవు జాతి కానీ
పంక్తి 92:
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
:తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి
*
వెలయాలు సేయు బాసలు
పంక్తి 98:
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
:తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.
*
వెలయాలివలనఁ గూరిమి
పంక్తి 104:
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
:తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.
*
వీడెము సేయని నోరును
పంక్తి 110:
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
:తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!
*
వినదగు నెవ్వరుచెప్పిన
పంక్తి 116:
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
:తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
*
వరి పంటలేని యూరును
పంక్తి 122:
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
:తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.
*
వరదైన చేను దున్నకు
పంక్తి 128:
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
:తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.
*
లావుగలవానికంటెను
పంక్తి 134:
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
:తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.
*
రూపించి పలికి బొంకకు
పంక్తి 140:
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
:తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
*
రా పొమ్మని పిలువని యా
పంక్తి 146:
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.
*
నాది నొకని వలచియుండగ
పంక్తి 152:
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
:తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు.
*
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
పంక్తి 158:
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
:తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.
*
మాటకు బ్రాణము సత్యము
పంక్తి 164:
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
*
మంత్రిగలవాని రాజ్యము
పంక్తి 170:
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
:తాత్పర్యం: సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.
*
మండలపతి సముఖంబున
పంక్తి 176:
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
:తాత్పర్యం: కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.
*
బలవంతుడ నాకేమని
పంక్తి 182:
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
:తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?
*
బంగారు కుదువబెట్టకు
పంక్తి 188:
నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
:తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.
*
పొరుగున పగవాడుండిన
పంక్తి 194:
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
:తాత్పర్యం: ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.
*
పెట్టిన దినములలోపల
పంక్తి 200:
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
:తాత్పర్యం: అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.
*
పులిపాలు దెచ్చిఇచ్చిన
పంక్తి 206:
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
:తాత్పర్యం: దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.
*
పుత్రోత్సాహము తండ్రికి
పంక్తి 212:
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
:తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.
*
పురికిని బ్రాణము కోమటి
పంక్తి 218:
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.
*
పిలువని పనులకు బోవుట
పంక్తి 224:
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
:తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.
*
పాలసునకైన యాపద
పంక్తి 230:
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
:తాత్పర్యం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.
*
పాలను గలిసిన జలమును
పంక్తి 236:
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
:తాత్పర్యం: పాలతో కలిసిన నీరు కూడా పైకి పాలలాగే కనపడుతుంది. పరిశీలిస్తే పాల రుచిని చెడగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని కూడా పోగొట్టును. కనుక అలాంటి స్నేహం వలదు.
*
పాటెరుగని పతికొలువును
పంక్తి 242:
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ
:తాత్పర్యం: శ్రమను తెలుసుకోలేని ప్రభువును సేవించడం, కలయికకు తెలివిలేని స్త్రీతో సంభోగం, వెంటనే చెడిపోయేట్లున్న స్నేహం నదీ ప్రవాహానికి ఎదురీదినట్లే.
*
పలుదోమి సేయు విడియము
పంక్తి 248:
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!
:తాత్పర్యం: దంతధావనం చేసుకుని, తలంటు పోసుకుని, తాంబూలం వేసుకుని పోయిన నిద్ర, స్త్రీలతో ప్రణయకలహం వచ్చిన రోజు పొందు అత్యంత సౌఖ్యప్రదాలు. వాటి విలువ ఇంతని చెప్పలేము.
*
పర్వముల సతులఁ గవయకు
పంక్తి 254:
గర్వింపనాలి బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ
:తాత్పర్యం: పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.
*
పరుల కనిష్టము సెప్పకు
పంక్తి 260:
బరుఁగదిసిన సతి గవయకు
ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!
:తాత్పర్యం: ఇతరులకు అప్రియములను పలకవద్దు. పనులు లేక పొరుగిళ్లకు పోవద్దు. ఎప్పుడూ ఇతరులు పొందిన భార్యను కలివవద్దు. తెలిసీ, పొగరుబోతైన గుర్రాన్ని ఎక్కవద్దు.
*
పరసతుల గోష్టినుండి
పంక్తి 266:
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
:తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.
*
పరసతి కూటమి గోరకు
పంక్తి 272:
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!
:తాత్పర్యం: ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.
*
పరనారీ సోదరుఁడై
పంక్తి 278:
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
:తాత్పర్యం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.
*
పనిచేయునెడల దాసియు
పంక్తి 284:
దనభుక్తి యెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!
:తాత్పర్యం: భార్య... ఇంటిపనుల్లో దాసిగా, సంభోగ సమయంలో రంభగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా, భోజనం పెట్టే సమయంలో తల్లిగా ప్రవర్తించేలా ఉండాలి.
*
పతికడకుఁ దన్నుగూర్చిన
పంక్తి 290:
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!
:తాత్పర్యం: ప్రభువు వద్దకు, భార్య దగ్గరికి, భగవంతుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు బుద్ధిమంతులు వట్టిచేతులతో వెళ్లరు. ఇదియే నీతిమార్గము.
*
పగవల దెవ్వరితోడను
పంక్తి 296:
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
:తాత్పర్యం: భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరవాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.
*
నవ్వకుమీ సభలోపల
పంక్తి 302:
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
:తాత్పర్యం: సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.
*
నవరస భావాలంకృత
పంక్తి 308:
నవివేకి కెంతఁజెప్పినఁ
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో శృంగారింపబడిన కవిత్వ సంబంధ సంభాషణ, కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే.
*
నరపతుల మేరదప్పిన
పంక్తి 314:
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!
:తాత్పర్యం: రాజు హద్దుమీరి ప్రవర్తించినా, శాశ్వతంగా విధవ ఇంట పెత్తందారైనా, లేఖకుడు నియోగి కాక వైదికుడయినా ప్రాణము మీదికి వచ్చును. తథ్యము.
*
నవమున బాలుంద్రావరు
పంక్తి 320:
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
:తాత్పర్యం: మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును.
*
నమ్మకు సుంకరి జూదరి
పంక్తి 326:
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!
:తాత్పర్యం: పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కమసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.
*
నడువకుమీ తెరువొక్కటఁ
పంక్తి 332:
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!
:తాత్పర్యం: తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు. *ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మరిమీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!
:తాత్పర్యం: బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును.
*
ధనపతి సఖుఁడై యుండియు
పంక్తి 342:
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!
:తాత్పర్యం: గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయపడాలి గానీ తన దగ్గర ఉన్నవారి దగ్గర ఎంత భాగ్యం ఉన్నా నిష్ప్రయోజనం
*
చేతులకు దొడవు దానము
పంక్తి 348:
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
:తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.
*
దగ్గర కొండెము సెప్పెడు
పంక్తి 354:
నెగ్గుఁబ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!
:తాత్పర్యం: మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.
*
తాను భుజింపని యర్థము
పంక్తి 360:
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!
:తాత్పర్యం: అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి తరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును.
*
తలమాసిన నొలుమాసిన
పంక్తి 366:
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!
:తాత్పర్యం: భూలోకంలో... తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.
*
తలనుండు విషము ఫణికిని
పంక్తి 372:
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
:తాత్పర్యం: పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.
*
తములము వేయని నోరును
పంక్తి 378:
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
:తాత్పర్యం: తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.
*
తనవారు లేనిచోటను
పంక్తి 384:
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!
:తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.
*
తన కలిమి ఇంద్రభోగము
పంక్తి 390:
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!
:తాత్పర్యం: తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే... ఇది నిజము.
*
తనయూరి తపసితనమును
పంక్తి 396:
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!
:తాత్పర్యం: తన ఊరివాళ్ల తపోనిష్ఠ, కుమారుని విద్యాధిక్యత, భార్య సౌందర్యం, ఇంటి వైద్యాలను ఎవ్వరూ కూడా గొప్పగా వర్ణించి చెప్పరు.
*
తన కోపమె తన శతృవు
పంక్తి 402:
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
:తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం.
*
తడ వోర్వక యొడలోర్వక
పంక్తి 408:
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!
:తాత్పర్యం: ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును.
*
చేతులకు దొడవు దానము
పంక్తి 414:
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
:తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.
*
చుట్టములు గానివారలు
పంక్తి 420:
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
:తాత్పర్యం: ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.
*
కొరగాని కొడుకు పుట్టినఁ
పంక్తి 426:
జెరకు తుద వెన్నుఁపుట్టిన
జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: చెరకుగెడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఉపయోగ పడకపోగా తండ్రికి ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు.
*
కోమలి విశ్వాసంబును
పంక్తి 432:
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!
:తాత్పర్యం: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.
*
గడనగల మననిఁజూచిన
పంక్తి 438:
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
:తాత్పర్యం: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.
*
చీమలు పెట్టిన పుట్టలు
పంక్తి 444:
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!
:తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.
*కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!
:తాత్పర్యం: భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.
*
కూరిమిగల దినములలో
పంక్తి 455:
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
:తాత్పర్యం: పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.
*
కొంచెపు నరుసంగతిచే
పంక్తి 461:
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
:తాత్పర్యం: చిన్న నల్లి కుడితే... ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.
*
కారణములేని నగవును
పంక్తి 467:
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!
:తాత్పర్యం: కారణం లేని నవ్వు, నృత్యం (రవిక) లేని స్త్రీ, పూర్ణం లేని బూరె, వీరణం లేని పెళ్లి వ్యర్థాలు.
*
కాముకుడు దనిసి విడిచిన
పంక్తి 473:
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరవాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.
*
కాదు సుమీ దుస్సంగతి
పంక్తి 479:
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
:తాత్పర్యం: చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.
*
కవిగానివాని వ్రాఁతయు
పంక్తి 485:
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!
:తాత్పర్యం: కవి కానివాడు రాసిన రచన, తొమ్మిది రసాల స్థితులు తెలియని స్త్రీ ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనం వ్యర్థం.
*
కసుగాయఁ గరచి చూచిన
పంక్తి 491:
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
:తాత్పర్యం: పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.
*
కరణము సాధై యున్నను
పంక్తి 497:
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
:తాత్పర్యం: కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.
*
కరణము గరణము నమ్మిన
పంక్తి 503:
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
:తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.
*
కమలములు నీడఁ బాసినఁ
పంక్తి 509:
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!
:తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.
*
కప్పకు నొరగాలైనను
పంక్తి 515:
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
:తాత్పర్యం: కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.
*
కనకపు సింహాసనము
పంక్తి 521:
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!
:తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.
*
కడు బలవంతుడైనను
పంక్తి 527:
దడవుండనిచ్చె నేనియు
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
:తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.
*
ఓడల బండ్లును వచ్చును
పంక్తి 533:
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
:తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.
*
ఒల్లనిసతి నొల్లనిపతి
పంక్తి 539:
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
:తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.
*
ఒకయూరికి నొక కరణము
పంక్తి 545:
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
:తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలు పుట్టి సమస్తం చెడిపోవుట సహజము.
*
ఏరకుమీ కసుగాయలు
పంక్తి 551:
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
:తాత్పర్యం: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!
*
ఎప్పుడు సంపద కలిగిన
పంక్తి 557:
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
:తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.
*
ఎప్పుడు దప్పులు వెదకెడు
పంక్తి 563:
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
:తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!
*
ఉపకారికి నుపకారము
పంక్తి 569:
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
:తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.
*
ఉదకము ద్రావెడు హయమును
పంక్తి 581:
నెత్తిచ్చి కరగిపోసిన
నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!
:తాత్పర్యం: బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లు కానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు.
*
ఉడుముండదె నూరేండ్లును
పంక్తి 587:
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
:తాత్పర్యం: ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.
*
ఇమ్ముగఁ జదువని నోరును
పంక్తి 593:
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
:తాత్పర్యం: ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!
*
ఆఁకొన్న కూడె యమృతము
పంక్తి 599:
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
:తాత్పర్యం: లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.
*
అల్లుని మంచితనంబును
పంక్తి 605:
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.
*
అప్పుగొని సేయు విభవము
పంక్తి 611:
దప్పురయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
:తాత్పర్యం: రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.
*
అడియాస కొలువుఁ గొలువకు
పంక్తి 617:
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
:తాత్పర్యం: వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.
*
అడిగిన జీతంబియ్యని
పంక్తి 623:
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
:తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.
*
అక్కరకు రాని చుట్టము
పంక్తి 629:
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
:తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.
*
శ్రీరాముని దయచేతను
పంక్తి 635:
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!
:తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.
</Poem>
 
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు