బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
{{శుద్ధి}}
"కుక్కకి యజమానుడు ఎంత అవసరమో, ఆడపిల్లకి మొగుడు అంత అవసరం. కాని, ప్రతి స్త్రీకి ఇట్లా ఏదొ ఒక భర్త ఎలాంటివాణ్ణొ ఒకణ్ణి దానం చేసితీరే సఘం, భర్త లేకపొతే ఒప్పుకోని సంఘం, ఆ భర్త పోతే మళ్ళీ దానం చెయ్యదేమి? స్త్రీకి భర్త ఉండటమే అంత అవసరమైతే, ఎప్పుడూ ఉండనక్కర్లేదూ? భర్త ఒద్దని ఏడుస్తున్న చిన్న పిల్లలకి బలవంతంగా కట్టపెడుతుంది, భర్త కావాలని గోలపెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి?"-- [[చలం]] .
బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిని '''బ్రహ్మచారి''' అంటారు. మనస్సూ, శరీరం ఆరోగ్యంగా ఉంచి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసేది బ్రహ్మచర్యం. కనుకనే మానవులు ఆచరింపవలసిన చతుర్విధ కర్మలలో బ్రహ్మచర్యాన్ని మొదట చెబుతారు. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. తమ ఎనిమిదో ఏట ఆచార్యుని ఉపదేశం పొందినప్పటి నుంచి బాలకుల్ని బ్రహ్మచారులుగా , బాలికలని బ్రహ్మచారిణులుగా పిలుస్తారు. వారు గురుకులంలో ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి బాగా చదువుకొని యువావస్థను పొందిన తర్వాతే యువకుణ్ణి వివాహమాడాలి. అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి, సుశీల అయిన యువతిని వివాహమాడాలి. <br />
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే. <br />
*[[డాక్టర్ అబ్దుల్ కలాం]] తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం :
"ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు".
Line 7 ⟶ 10:
*అమ్మాయి పెళ్ళికి ఇష్టపడకపోయినా, శరీరవయసుతో పాటు తగిన మానసిక స్థైర్యము, దైర్యము, రాకపోయినా, పెళ్ళి నిర్భందంగా ఎందుకు చేయాలి? పిల్లల్ని కని మళ్ళీ ఈ దుర్మార్గం లోకి , ఈ కష్టాల్లోకి కొత్త జీవుల్నితేవాలి.ముప్పై ఏళ్ళలో యవ్వనం అంతమౌతుంది. ఎంతవారికైనా రోగాలు ముసలితనం మరణం తప్పవు. పెళ్ళికాని స్త్రీలకు సమాజంలో రక్షణ లేకపోవడం శోచనీయం. హిందూ క్రైస్తవ స్త్రీలకు [[నన్స్]] , [[బ్రహ్మకుమారీ]] పద్ధతులున్నాయి గానీ ముస్లిం స్త్రీలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ముస్లిం స్త్రీ ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. [[అవివాహిత]] ల రక్షణ కోసం వారి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని పెంచటంకోసం గట్టి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగానూ సామాజికంగానూ జరగాలి.
 
===ప్రముఖ భారతీయ ఆజన్మ-బ్రహ్మచారులు===
* డాక్టర్ [[అబ్దుల్ కలాం]] (మాజీ రాష్ట్రపతి):
* [[అటల్ బిహారి వాజపేయి]] (మాజీ ప్రధాని):
Line 29 ⟶ 32:
* [[ఆషా పరేక్]] హిందీ నటి
* [[నదీరా]] హిందీ నటి
* [[రేఖ]] హిందీ నటి
* [[జయలలిత]] (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)
* [[కోవై సరళ]]
Line 43 ⟶ 45:
*[[కె.సుజాతారావు ]] ఐ.ఏ.ఎస్.
 
== కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు ==
* [[ఆడంస్మిత్]] ఆర్దికశాస్త్రవేత్త
* [[ఆండ్రి ది జైంట్]] , మల్లయోధుడు
Line 64 ⟶ 66:
*[[రాబర్ట్ షుమాన్]] ఐరోపా యూనియన్ స్థాపకుడు
*[[ విలియం మెకంజీ]] కెనడా ప్రధాని
 
===డా|| పూర్ణిమా ఎ. నాగరాజ సైకియాట్రిస్టు చెప్పిన విషయాలు===
"ఈ వ్యవస్థ పెళ్లి పేరుతో స్త్రీనుంచే అన్ని సర్దుబాట్లూ కోరుతుంది. వయఃపరిమితిలేనిది పెళ్లి ఒక్కటే. ఒంటరిగా ఉండటం జీవితఖైదు కాదు".
 
ఒంటరి బతుక్కే ఓటేస్తిరా?
తన్మయి వయసు ముప్ఫై. పొడుగ్గా అందంగా ఉంటుంది. ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం. ఆరంకెల జీతం. విదేశాలకు వెళ్తూ ఉంటుంది. తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోలేదు... ఒంటరిగా ఉంటోంది. ఎందుకని అంటే... తండ్రిగా, సోదరుడిగా, స్నేహితుడిగా... పర్వాలేదు. కానీ భర్తగా పురుషుడి సాహచర్యం నావల్ల కాదంటుంది. కుటుంబసభ్యులెంతగా నచ్చజెప్పినా ససేమిరా అంది. ఎప్పటికైనా ప్రేమలో పడకపోతుందా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
లావణ్య పరిస్థితి అలా కాదు. పద్ధతిగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తుంది. దాదాపు యాభై పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయామెకి. అన్నీ ఏదో ఒక కారణంతో వెనక్కిపోయాయి. పురుషుల్ని ఆకట్టుకునేలా అందంగా లేనందుకు ఆమె దురదృష్టాన్ని నిందించారంతా. దాంతో కుంగుబాటుకి లోనైన లావణ్య తరచూ ఆత్మహత్యాయత్నాలు చేస్తుంటుంది. కాస్త బొద్దుగా ఉండే నికిత పరిస్థితీ అంతే. బరువు తగ్గితే కానీ సంబంధాలు కుదరవన్నారు. చివరికి ఇద్దరు పిల్లలున్న అతనితో రెండోపెళ్లికి ఆమెను ఒప్పించబోయారు. ఆమె ఇల్లు విడిచి వెళ్లి హాస్టల్లో ఉంటోంది. జిమ్‌కెళ్తోంది కానీ తన కోసమే తప్ప పెళ్లి కోసం మాత్రం కాదని కచ్చితంగా చెప్తోంది.
తరతరాలుగా సమాజానికి మూలమైన వివాహవ్యవస్థకి ఇలాంటి అనుభవాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థ పెళ్లి పేరుతో స్త్రీనుంచే అన్ని సర్దుబాట్లూ కోరుతుంది. ఆమె అందంగా ఉండాలి. పురుషుడిని ఆకట్టుకోవాలి. అతడ్ని సంతృప్తిపరచాలి. అతని కుటుంబానికి తగినట్లుగా ఆమె మారాలి. కలలు, త్యాగాలు అన్నీ మెట్టినింటి కోసమే. ఆమె ఇష్టాయిష్టాలతో ఎవరికీ ప్రమేయం ఉండదు. తమ స్వాభిమానాన్ని గౌరవించని ఈ ధోరణి ఇప్పటివారికి నచ్చడంలేదు. శతాబ్దాలుగా సమాజంలో స్త్రీ హోదా, పరిస్థితులు మారినా, పురుషుడితో సమానంగా ఆమె అన్నిరంగాల్లో పోటీపడుతున్నా... పెళ్లి దగ్గర మాత్రం ఆమెను చూసే తీరు మారడం లేదు. ఇప్పటికీ స్త్రీ జీవితానికి పరమావధి పెళ్లే అనుకునేవాళ్లు ఉన్నారు. అందుకే కొంతమంది అమ్మాయిలు పెళ్లంటేనే 'వద్దు పొమ్మంటున్నారు'. అది తప్పా?
 
కానే కాదు... పురుషులు వివాహం చేసుకోకుండా ఉంటే పట్టించుకోని సమాజం స్త్రీలనెందుకు పట్టించుకోవాలి? అది వాళ్ల ఇష్టం కదా! కానీ, సమాజం...
ఒంటరిమహిళలను రకరకాల మాటలతో వేధిస్తుంది.
గాలివార్తలకు వారిని కేంద్రబిందువును చేస్తుంది.
వారిలో ఏదో లోపం ఉందంటుంది.
కుటుంబం మంచిది కాదంటుంది.
'స్త్రీవాది' కాబోలంటుంది(అదేదో నేరమైనట్లు).
 
... ఇలాంటి ఎన్నో మాటలు ఆమె చుట్టూ అల్లుకుని సదరు మహిళకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆమె మీద అనవసరంగా జాలి చూపుతూ, అడక్కుండానే సాయం చేస్తామంటూ వచ్చి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూసే ప్రబుద్ధులకూ కొదవలేని సమాజం మనది. అంతేకాదు... ఆమె కుటుంబాన్ని సైతం చికాకుపరిచే పిచ్చిప్రశ్నలతో వేధిస్తారు. అందుకే తల్లిందండ్రులు ఎవరో ఒకరు... పెళ్లి సంబంధం కుదిరితే చాలనుకుంటారు. కుటుంబంలో మిగిలిన పిల్లలకు పెళ్లి కాదన్న భయంతో బలవంతాన ఆ అమ్మాయి పెళ్లిచేస్తారు.
 
===వనితలు ఇవి గుర్తుంచుకోవాలి===
లోకాన్ని తట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఒంటరిగా ఉండాలన్నది మీ నిర్ణయమైతే అందుకు సిద్ధపడండి.
పశ్చాత్తాపం వద్దు. ఒంటరిగానూ సంతోషంగా ఉండడం సాధ్యమే.
మంచి స్నేహితులను, సపోర్టు సిస్టమ్‌ను తయారుచేసుకోండి. వివాహితులను స్నేహితుల్లోంచి తీసేయవద్దు. వాళ్లుకూడా మీకు మంచి స్నేహితులు కాగలరు.
అందరూ ఏవేవో ప్రశ్నలడుగుతారని వేడుక లకు దూరంగా ఉండవద్దు. వెళ్లండి. హుందాగా సమాధానాలు చెప్పండి.
వివాహబంధంలో ఇతరులు ఎదుర్కొనే అనుభవాలు అందరికీ ఎదురవుతాయనుకోవద్దు. అలాంటివి విన్నప్పుడల్లా వ్యవస్థ పట్ల మరింత వైముఖ్యం పెంచుకోవడం, మీ ఒంటరితనాన్ని సమర్థించుకోవడం సబబు కాదు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుని ఆనందంగా జీవించండి.
ఒంటరిగా ఉండటం జీవితఖైదు కాదు. ఎప్పుడు వివాహం పట్ల ఆసక్తి కలిగినా ముందడుగు వేయండి.వయఃపరిమితిలేనిది పెళ్లి ఒక్కటే.
==బ్రహ్మచారుల వాదనలు==
అమ్మా, నాన్నల కోసం పెళ్ళి చేసుకోవడమేమిటి? ఒంటరిగా ఉన్నంత మాత్రాన కష్టపడిపోతామా?. పెళ్ళి చేసుకుంటే జీవితం ధన్యమైపోతుందని గ్యారంటీ ఏమిటి? మమ అనిపిస్తే చాలా? మనసుతో సంబంధం ఉండదా? సుఖానికే తప్ప సంతోషానికి ప్రాధాన్యత లేదా? ఇష్టం లేదు మొర్రో అంటే ఎందుకు అర్థం చేసుకోరు. పెళ్ళి చేసుకోదలుచుకోని వారు ఈ ప్రపంచంలో బతకడానికి అర్హులు కారా? పెళ్ళి జరిగి ఆ మొగుడు సచ్చి ఊరుకుంటే ఏమి చేస్తారు?
సమాజం దృష్టిలో భార్య, భర్త అయితే చాలు. నీకు పెళ్ళి అయిందా అన్నదే ప్రశ్న. ఆనందంగా ఉన్నావా అన్నది ప్రశ్నే కాదు. పెళ్ళి అయిందా. అయింది. పిల్లలున్నారా. ఉన్నారు. అంతే. ఈ స్టేటస్ కావాలి అంతే. క్షణ క్షణం చస్తూ బతుకు, సమాజానికి ఏమీ సంబంధం ఉండదు. అవివాహితులుగా ఉండాలనే నిర్ణయం ఆలోచించి తీసుకుని ఉంటారు అని ఎందుకు అర్థం చేసుకోరు. అవివాహిత్వాన్ని ఓ పెద్ద నేరంలా చూడడం దేనికి?పెళ్లి కాకపోవడం ఘోరం కాదు. వద్దనుకోవడం నేరం కాదు, చేసుకోకపోతే పరమ దుఃఖంలో మునిగేది లేదు. అమ్మా, నాన్న తాము లేకపోయాక, తల్లీ, తిన్నావా అని అడిగే దిక్కు ఉండాలని పెళ్ళో పెళ్ళని మొత్తుకుంటారు.చేసుకున్నవాడు పోతే ఏం చేస్తాం అంటే ఏమి చేయలేము అని ఏడుస్తారు. పెళ్ళి గురించిన ఆలోచన లేదంటే అదేదో హత్య చేసినట్టో, దయ్యం పట్టినట్టో ఎందుకు చూస్తారు?
 
===తల్లిదండ్రులు తెలుసుకోవాలి===
ఏ కారణం చేతనైనా మీ అమ్మాయి ఒంటరిగా ఉంటానంటే భయపడి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడకండి. ఈరోజుల్లో జీవితానికి పెళ్లే పరమావధి కాదని గుర్తుంచుకోండి. తనను తాను పోషించుకోగల, సమాజానికి జవాబు చెప్పగల సమర్థురాలైన బిడ్డకు తల్లిదండ్రులుగా గర్వించండి. ఆమె ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు. తనతో చక్కటి అనుబంధం కలిగివుండండి. అవసరమైనప్పుడు అండగా నిలవండి. బంధువులో, పరిచయస్తులో ఏమైనా వ్యాఖ్యానిస్తే పట్టించుకోవద్దు. మీ అమ్మాయి మేలిమి రత్నమని మీకు తెలుసు.
 
===వ్యాఖ్యానించకండి===
మీకు తెలిసినవారిలో, పరిచయస్తుల్లో ఒంటరిగా ఉన్న యువతులు ఉన్నారా? వారి గురించి ఎవరో ఏదో అంటోంటే మీరూ వంతపాడుతున్నారా? దయచేసి అలా చేయవద్దు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో మన ప్రమేయం అనవసరం. తెలిసీ తెలియకుండా ఇతరుల గుణశీలాలను అంచనా వేయవద్దు. మరొకరితో చెప్పవద్దు. ఒంటరి మహిళలు సమాజానికి కానీ, పక్కనున్న కుటుంబాలకు కానీ హానికారకులు కారు. వాళ్ల జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయమది. వాళ్ల మానాన వాళ్లను వదిలేయండి. కొంతమంది శారీరక, మానసిక సమస్యలవల్ల కూడా వివాహానికి దూరంగా ఒంటరిగా మిగిలిపోవచ్చు. ప్రతినిమిషం వారికది గుర్తుచేస్తూ చిన్నబుచ్చకండి. చేతనైతే అండగా నిలవాలి. లేదంటే వారి జోలికి వెళ్లకూడదు.
==ఒంటరి మహిళల హక్కుల కోసం ==
దేశ జనాభాలో ఎనిమిది శాతం ఒంటరి మహిళలు. వీరిలో అత్యధికులు మానసికంగా, శారీరకంగా... లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. సామాజికంగానూ చిన్నచూపు.అవివాహిత... వితంతువు... విడాకులు పొందిన స్త్రీ... ఎవరైనా కానివ్వండి... ఒంటరి మహిళను కొంత చిన్నచూపు చూసే తీరు మన సమాజంలో ఇంకా ఉంది. మగవారితో ముడిపెట్టి ఆడవారికి గౌరవమిచ్చే ఈ తరహా ధోరణి వల్ల దేశ వ్యాప్తంగా కోట్లమంది మహిళలు బాధలకు లోనవుతున్నారు. అణచివేతకు, వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే [[డాక్టర్‌ జెన్నీశ్రీవాస్తవ]] 'ఏకల్‌ నారీ శక్తి సంఘటన్‌' పేరుతో ఒక సంస్థను ఆరంభించారు. ఒంటరి మహిళల హక్కుల పోరాటానికై జాతీయ స్థాయిలో 'నేషనల్‌ ఫోరం ఫర్‌ సింగిల్‌ ఉమెన్స్‌ రైట్స్‌' సంస్థను ఏర్పరిచారు. ఎనిమిది రాష్ట్రాల్లో అరవై వేల మంది సభ్యులతో సంస్థను విస్తరించారు.ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర అణచివేతను గమనించారు. దేశంలో 3.3 కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారిలో అత్యధికులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇది కెనడా జనాభా కన్నా ఎక్కువ .భార్య మరణిస్తే మగవారు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మహిళల విషయంలో మాత్రం ఆ వూసు రావడం లేదు. పుట్టింట్లో తల్లిదండ్రులున్నంత వరకే ఆదరణ... మెట్టినింట్లో అత్తమామల నిరాదరణ... ఒంటరిగా ఉంటే అత్యాచారాలు... భర్త ఆస్తిని కాజేసే యత్నాలు... అపనిందల వంటి బాధలెన్నింటినో వారు భరిస్తున్నారు. [[ఏకల్‌ నారీ శక్తి సంఘటన్‌]] సభ్యులు జిల్లాలోని బ్లాకు స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. భుమిపై హక్కు... ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు... పింఛన్లు... అత్తమామలకు కౌన్సెలింగ్‌... మోసాలకు పాల్పడిన పురుషులపై చర్యలు... వంటివి చేపడతారు. భర్త ఆస్తిని కాజేసే యత్నం చేసినప్పుడు వితంతువులు పంచాయితీ రికార్డులో భర్త పేరిట భూమి ఉంటే పట్వారీకి చెప్పి బదిలీ చేయిస్తారు.ఒంటరి మహిళల హక్కుల కోసం జాతీయ స్థాయిలో ఒక వేదికను ఈ మధ్యనే ఏర్పాటుచేశారు. సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడం... ప్రతి రాష్ట్రంలో సంస్థను ఏర్పరచడం... ఒంటరి మహిళల్లో నాయకత్వ సామర్థ్యాలను ప్రోత్సహించడం... వంటివి ఆ జాతీయ ఫోరం లక్ష్యాలు.
==అవివాహిత కుమార్తెకు జీవితాంతం పింఛను==
పింఛనుదారు భాగస్వామి కూడా చనిపోయినపుడు కుటుంబ సభ్యుల్లో అవివాహిత కుమార్తెకు జీవితాంతం కుటుంబ పింఛను అందుతుంది. ఆమెకు పాతికేళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే పింఛను ఇవ్వాలంటూ ఇప్పటివరకూ ఉన్న నిబంధనలో సవరణ చోటుచేసుకుంది. అలాగే వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు ఇతరత్రా నెలకు రూ. 2,440 మించి ఆదాయం ఉంటే కుటుంబ పింఛనును నిలిపివేయాలన్న నిబంధనను స్వల్పంగా మార్చారు. ఇలా నిర్ణీత మొత్తం అని కాకుండా... కరవు భృతితో కలిపి కనీస కుటుంబ పింఛను మొత్తాన్నీ మించిన స్థాయిలో ఆదాయం లభించే వరకూ ఇక ఆమెకు పింఛను లభిస్తుంది.
* వితంతువు, విధురుడు (విడోవర్‌) మృతి లేదా తిరిగి వివాహం... ఏది ముందైతే అంతవరకు కుటుంబ పింఛను అందుతుంది.
* కుమారుడు, కుమార్తె (వింతతు కుమార్తెతో సహా)కు వివాహం, పునర్‌వివాహం, లేదా వారు సంపాదన మొదలు పెట్టిన తేదీ, లేదా 25 ఏళ్ల వయస్సు- వీటిలో ఏది ముందైతే అంత వరకు.
* కుమారుడు/కుమార్తె శారీరక లేదా మానసిక వైకల్యం కలిగి ఉంటే వారికి కొన్ని నిబంధనలకు లోబడి జీవితాంతం పింఛను అందుతుంది.
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు