శశికాంత్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png రవిచంద్ర (చర్చ) 15:46, 5 మార్చి 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒకే సభ్యనామాన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.


ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందనసవరించు

శశికాంత్ గారూ, మీరు బాగా రాస్తున్నారు. అభినందనలు. మీ కృషి ఇలాగే కొనసాగించండి. ఏమైనా సందేహాలుంటే ఇదే పేజీలో అడగండి. --రవిచంద్ర (చర్చ) 10:45, 7 మార్చి 2010 (UTC)

సూచనసవరించు

శశికాంత్ గారు, నేను వ్రాసిన వ్యాసము హిందువులపై అకృత్యాలు చూసే ఉంటారు. ఆధునిక కాలము లోని సంఘటనలతోబాటు గత మూడు శతాబ్దాలుగా జరిగిన దారుణాల గురించి కూడ వ్రాయండి. Kumarrao 12:35, 6 ఆగష్టు 2010 (UTC)

దేవుడు - క్రీస్తుసవరించు

దేవుడు అని ఉన్నచోట క్రీస్తు అని మార్చటం సమంజసం కాదనుకుంటాను ఎందుకంటే క్రైస్తవ త్రిత్వంలో దేవుడు, బిడ్డ(క్రీస్తు), పరిశుద్ధాత్మ మూడంకాలు. --వైజాసత్య 16:20, 25 ఆగష్టు 2010 (UTC)

బైబిలులో అంశాలు పలు ధృక్కోణాలలో ఉంటాయి. కొన్ని నేరుగా దేవుడు చెప్పినవి, కొన్ని క్రీస్తు చెప్పినవి, కొన్ని అపోస్తలులు చెప్పినవి. వాటి మధ్య స్పష్టత కొరుకు కూడా అవి అలాగే ఉంచడం మంచింది :-) --వైజాసత్య 16:25, 25 ఆగష్టు 2010 (UTC)
  • క్రైస్తవ మతంలో దేవుడు, క్రీస్తు, పరిసుద్ధాత్మ, ప్రభువు అన్నీ ఒకటే. ఇస్లాం ప్రకారం దేవుడు వేరు, క్రీస్తు వేరు. కానీ క్రైస్తవ మతం ప్రకారం క్రీస్తే దేవుడు. ఇస్లాం ప్రకారం క్రీస్తు కేవలం బిడ్డ మరియు ప్రవక్త. కానీ క్రైస్తవులు క్రీస్తుని దేవుడిగా భావిస్తారు. దేవుడు క్రీస్తు రూపం అనగా బిడ్డగా జన్మించాడని వారి నమ్మకం. ఈ లంకెను చూడండి. Jesus is God - Biblical Proof. మీరు ఇస్లాం మత నమ్మకాలని క్రైస్తవ మతంకి వర్తింపచేయరాదు. ఇస్లాంలో క్రీస్తు దేవుడు కాదు, కాని క్రైస్తవ మతంలో క్రీస్తు దైవుడు. --శశికాంత్ 16:46, 25 ఆగష్టు 2010 (UTC)
నాకీ విషయం తెలుసు. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలకు గొడవకు కారణం ముస్లింలు క్రీస్తును కేవలం ఒక ప్రవక్తగా అంగీకరించారు. కానీ క్రైస్తవులు క్రీస్తు దేవుని బిడ్డగా (by inference and indirect pointing here and there) క్రీస్తు దేవుడని అంగీకరిస్తారు. కానీ బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలకు, క్రీస్తు చెప్పినవాటికి distinction ఉంది. (నేను క్రీస్తు దేవుడు కాదని వాదించట్లేదు). అయినా కృష్ణుడు దేవుడని, మహాభారతంలో దేవుడు అని వచ్చి దగ్గరల్లా కృష్ణుడు అని వ్రాసేస్తామా. అలాగే, బైబిల్లో దేవుడు అని ఉన్నచోట దేవుడు అని, క్రీస్తు అని ఉన్న చోట క్రీస్తు, పరిశుద్ధాత్మ అని ఉన్నచోట పరిశుద్ధాత్మ అని వ్రాయలి --వైజాసత్య 17:23, 25 ఆగష్టు 2010 (UTC)
ఈ బైబిలు వాక్యాలు చూడండి. వీటిలో అన్నింటికి క్రీస్తు అని వ్రాసేస్తే ఎలా ఉంటుందో --వైజాసత్య 17:29, 25 ఆగష్టు 2010 (UTC)

నా పేరు కూడా మార్చండి :)సవరించు

నా పేరు కూడా మార్చండి.... :)
వాడుకరి పేరుని Ysashikanth నుండి శశికాంత్‌ కు మార్చమని మనవి..... :) --శశికాంత్ 05:45, 5 సెప్టెంబర్ 2010 (UTC)

మీ పేరును శశికాంత్‌ గా మార్చటం పూర్తయ్యింది :-) --వైజాసత్య 13:49, 5 సెప్టెంబర్ 2010 (UTC)
ధన్యవాదాలు. నా దిద్దుబాట్ల సంఖ్య సున్నా అయిపోయింది. ఫర్వాలేదా ? ఈ సంఖ్య వల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా ? నా వీక్షణ జాబితా ఖాళీ అయిపోయింది.. దానిని చూడగలగే అవకాసం ఉందా ? ఇటీవలి మార్పులలో ఇప్పటికీ Ysashikanth గానే కనిపిస్తోంది. --శశికాంత్ 14:33, 5 సెప్టెంబర్ 2010 (UTC)
ఇక్కడ చూడండి మీ దిద్దుబాట్ల సంఖ్య పదిలంగానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇతర వికీపీడియాల్లో అంగ్లపేరుతోనే ఖాతా ఉంది. అక్కడి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అదే పేరుతో వచ్చినట్టుగా నమోదవుతున్నది. నేరుగా తెవికీకి వచ్చి శశికాంత్ అనే వాడుకరిపేరుతో లాగిన్ అయి చూడండి. కొంతకాలం క్రితం ఒకే లాగిన్‌తో అన్ని వికీపీడియాల్లో ప్రవేశించేలా ఏకీకృత లాగిన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికే మీ ఆంగ్ల లాగిన్ ను ఏకీకృత లాగిన్్‌గా నమోదు చేశారు. ఇప్పుడు తెలుగు వికీలో మాత్రం తెలుగు పేరుతో లాగిన్ ఏర్పడింది కానీ అది మీ ఏకీకృత లాగిన్ కు ఎలా అనుసంధానించాలో తెలుసుకుని ఆ పని చేస్తాను --వైజాసత్య 22:30, 5 సెప్టెంబర్ 2010 (UTC)
సమస్యకి పరిష్కారం ఇదండి - మీకు తెలుగు విక్షనరీ, తెలుగు వికీమూలాలు మొదలైన కొన్నిచోట్ల ఇంగ్లీషు పేరుతో ఖాతా ఉంది. అక్కడ కొన్ని దిద్దుబాట్లు చేశారు కూడాను. ఒక విధానమేవిటంటే మీరు అక్కడ కూడ మీ పేరును తెలుగులోకి మార్చమని కోరటం. కానీ అక్కడ మీ పేరును స్థానికంగా మార్చే అధికారం సభ్యులెవరికీ లేదు, వికీమీడియాలో అభ్యర్ధన చేయాలి. ఈ విధంగా చేస్తే అక్కడి దిద్దుబాట్లు కూడా ఈ వాడుకరి పేరుకే జత అవుతాయి. రెండవ పద్ధతిలో మీరు వికీపీడియాలో తెలుగు పేరుతో లాగిన్ అయి, ఆ తర్వాత విక్షనరికీ, వికీమూలాలకి వెళితే అక్కడ కూడ తెలుగు పేరుతో కొత్త ఖాతా ఆటోమేటిగ్గా తయారౌతుంది. కానీ, మీరు ఇంతకు ముందు విక్షనరీలో, వికీమూలాలలో చేసిన మార్పులు మీ పేరుకు జతకావు. మీరు ఏ పద్ధతి ఎంచుకున్నా నేను అందుకు సహాయం చేయగలను. --వైజాసత్య 22:51, 5 సెప్టెంబర్ 2010 (UTC)
ధన్యవాదాలు సత్యగారు, తెలుగు పేరుతో లాగిన్ అయ్యాక ఇప్పుడు అంతా బావుంది. కృతజ్ఞతలు. --శశికాంత్ 03:42, 6 సెప్టెంబర్ 2010 (UTC)

ఈ ఆదివారం సమావేశంసవరించు

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:41, 18 మే 2012 (UTC)

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:08, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

శశి కాంత్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:58, 13 మార్చి 2013 (UTC)

రాష్ట్రమండల క్రీడలు వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

రాష్ట్రమండల క్రీడలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2010 అక్టోబరులో ఒకటి రెండు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది.2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాష్ట్రమండల క్రీడలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:57, 23 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:57, 23 ఏప్రిల్ 2021 (UTC)