విడాకులు: కూర్పుల మధ్య తేడాలు

614 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[పెళ్ళి]] తరువాత [[భార్యాభర్తలు]] అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని '''విడాకులు''' గా పిలుస్తారు. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి.భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చు.వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయి.'పాత రోజుల్లో మన తాత, ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవు. అప్పట్లో వివాహ వివాదాలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే పరిష్కారమయ్యేవి. పిల్లలకోసం తల్లిదండ్రులు అహం వదులుకోవాలి.తల్లిదండ్రుల విడాకులవల్ల చివరకు బాధపడేది పిల్లలే. ఆడపిల్ల విషయంలోనైతే వివాహం సమయంలో''పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది.
== ఇస్లాంలో విడాకులు ==
[[ఇస్లాం]] ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఇక ఆ వివాహం చెల్లదు. కతార్‌కి చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్ లో తన భార్యకి తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. దీంతో అతడి వివాహం రద్దు చేయబడింది. [[షరియా]] చట్టం ప్రకారం ఇస్లామిక్ మతసంస్థ దార్-ఉల్-ఉలూమ్ వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది. డియోబండ్ కి చెందిన దార్-ఉల్-ఇఫ్తా అతడికి ఇక నుంచీ తన భార్య హరామ్ అని పేర్కొంది. తనకి భార్య మీద ప్రేమ ఉన్నా ఇప్పుడు ఆమెతో అతడు జీవితం కొనసాగించలేకపోతున్నాడని వాపోయాడు. పోనీ మళ్ళీ ఆమెనే పెళ్ళి చేసుకుందామన్నా ఇందుకు ఇస్లామిక్ చట్టాలు అంగీకరించవు. ఇందుకు ఒక పరిష్కారం సూచించారు. అదే హలాలాహ్. అంటే ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతడికి విడాకులిస్తేగానీ తిరిగి పాత భర్తని వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు. అంతకన్నా ముందు ఆమె ఇద్దత్ ని అనుసరించాలి. అనగా విడాకులు పొందాక మూడు నెలలు పాటు మళ్ళీ వివాహం చేసుకోరాదు. అంతేగాక తను అన్ని విధమైన సంతోషాలకు, సంబరాలకు దూరంగా ఉండాలి. ఇలా రెండు మార్లు ఇద్దత్ అనుభవించిన తర్వాత తిరిగి పాత భర్తని వివాహం చేసుకోవాలి. భార్య తలాక్ ఇచ్చిందా లేదా అన్న విషయంతో సంబంధం లేదని ఫత్వాలో పేర్కొనబడింది. ఈ విషయాలు బుఖారీలో(Vol. 2, P. 791) మరియు ఫతావా అల్-హిన్దియా లో పేర్కొనబడ్డాయని దార్-ఉల్-ఉలూమ్ కి చెందిన ముఫ్తీ ఆరిఫ్ కస్మీ చెప్పాడు.<ref>http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=4508570</ref>
మొబైల్‌ ఫోన్లో తలాక్‌ :మొబైల్‌ ఫోన్లో మూడుసార్లు తలాక్‌ చెప్పినప్పుడు నెట్‌వర్క్‌ సమస్య వల్ల కానీ ఇతర కారణాల వల్ల కాని అతని భార్యకు వినపడకపోయినా అది చెల్లుబాటు అవుతుందని దార్‌ ఉల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ ఫత్వా జారీ చేసింది.<ref>ఈనాడు 16.11.2010</ref>
 
== [[మనోవర్తి]] ==
విడిపోయిన [[భార్య]] పోషణ కోసం [[భర్త]] చెల్లించవలసిన [[భరణం]]. ఎయిడ్స్‌ ఉన్నా మనోపర్తి చెల్లించాల్సిందే. విడిపోయిన భార్యాపిల్లలకు మనోవర్తి చెల్లించకుండా తప్పించుకోవడం కుదరదు.భర్తగా.. నైతిక, సామాజిక, చట్టపరమైన తన బాధ్యత నుంచి అతను తప్పించుకోలేడు.రెండో భార్యకు మనోవర్తి రాదు.వివాహితుడ్ని పెళ్లాడిన హిందూ మహిళ తనకు మనోవర్తి కావాలని కోరే అవకాశం లేదు.హిందూ చట్టం ప్రకారం మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదు.
8,896

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559077" నుండి వెలికితీశారు