ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

4,015 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అంటువంటివి తింటారు. [[ఆల్ఫాఆల్ఫా]], [[లవంగము]], [[గోధుమ]], [[జొన్న]], [[మొక్కజొన్న]] మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే పీచు శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు.
 
== ఆకుకూరలతో కలిగే మేలు ==
* ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
* భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
* ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
* ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
* విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
* విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
* మధుమేహ వ్యాధి,కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించగల మెంతులు ( షుగర్ వ్యాధి ). మధుమేహం (షుగర్ వ్యాధి) ,గుండె జబ్బులు చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు.శరీరంలో కొలెస్టరాల్ గాని,రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి.ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాద్) చేసిన ఒక పరిశోదనలో తేలింది.
== పోషక విలువలు ==
ఆకు కూరల్లో సాధారణముగా [[క్యాలరీ]]లు చాలా తక్కువ, [[కొవ్వు పదార్ధాలు]] కూడా తక్కువే. క్యాలరీకిగల [[మాంసకృత్తులు|మాంసకృత్తుల]] శాతము చాలా అధికము. అలాగే [[పీచు పదార్థాలు]], [[ఇనుము]] మరియు [[కాల్షియం]] కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు (ఫైటో కెమికల్స్) అయిన [[విటమిన్ సి]], [[విటమిన్ ఎ]], [[ల్యూటిన్]] మరియు [[ఫోలిక్ ఆమ్లం]] కూడా అధికముగా ఉంటాయి.
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/564963" నుండి వెలికితీశారు