వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 15వ వారం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|100px '''సూర్యకాంతం''' తూర్పు గోదావరి జిల్లా [[కాకినా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
అసలు [[సంసారం]] చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. [[కోడరికం]] సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. [[బి.నాగిరెడ్డి]], [[చక్రపాణి]] లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] - సూర్యకాంతం, [[రమణారెడ్డి]] - సూర్యకాంతం, [[ఎస్.వి.రంగారావు]] - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే ''అందులో సూర్యకాంతం వుందా?'' అని ప్రేక్షకులూ, ''తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా?'' అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. [[చక్రపాణి]] (1954), [[దొంగరాముడు]] (1955), [[చిరంజీవులు]] (1956), [[తోడికోడళ్లు]] (1957), [[అత్తా ఒకింటి కోడలే]] (1958), [[ఇల్లరికం]] (1959), [[భార్యాభర్తలు]] (1961), [[గుండమ్మకథ]] (1962), [[కులగోత్రాలు]] (1962), [[దాగుడు మూతలు (1964 సినిమా)|దాగుడుమూతలు]] (1964), [[అత్తగారు-కొత్తకోడలు]], [[మూహూర్తబలం]] (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
 
 
 
''ఇంకా''....[[సూర్యకాంతం|పూర్తివ్యాసం]] [[వికీపీడియా:విశేష వ్యాసాలు|పాతవి]]<noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2011]]</noinclude>