సావిత్రి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Savithri_Mayabazaar_Colour.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Wknight94. కారణం: (No permission since 29 December 2010).
పంక్తి 21:
 
==తొలి జీవితం==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[గుంటూరు]] జిల్లా, [[తాడేపల్లి]] మండలంలోని [[చిర్రావూరు]] గ్రామంలో [[1936]] [[జనవరి 4]] న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా ''మారుతి'' అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ [[విజయవాడ]]లోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం [[నందమూరి తారక రామారావు|ఎన్టీఆర్]], [[జగ్గయ్య]] తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. [[బుచ్చిబాబు]] రాసిన '''ఆత్మవంచన''' అనే నాటకంలో కూడా నటించింది.
 
==చలనచిత్ర జీవితం==
"https://te.wikipedia.org/wiki/సావిత్రి_(నటి)" నుండి వెలికితీశారు