సావిత్రి (నటి)

సుప్రసిద్ధ సినీ నటి (మహా నటి)

నిశ్శంకర సావిత్రి (డిసెంబరు 6, 1936 - 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగ నాయుళ్ళు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.we should never forget this great artist forever!!! We all miss her very much !!!

nissankara savitri ganesh
Savitri Actress.jpg
జననం
నిశ్శంకర సావిత్రి

జనవరి 4, 1936[1].
చిర్రావూరు, గుంటూరు జిల్లా,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణండిసెంబర్ 26, 1981
ఇతర పేర్లుమహానటి సావిత్రి,
నడిగర్ తిలగమ్,
సావిత్రి గణేశ్
వృత్తినటి, దర్శకురాలు
జీవిత భాగస్వామిజెమిని గణేశన్
పిల్లలువిజయచాముండేశ్వరి,
సతీష్ కుమార్
తల్లిదండ్రులు
 • నిశ్శంకర గురవయ్య (తండ్రి)
 • సుభద్రమ్మ (తల్లి)

తొలి జీవితంసవరించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. [2]

చలనచిత్ర ప్రవేశానికి ముందుసవరించు

సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్నసమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది.

చలనచిత్ర జీవితంసవరించు

 
సావిత్రి

(“చలనచిత్ర జీవితంం”)పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.

ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై[citation needed], 1981 డిసెంబర్ 26 న మరణించింది

ఇతర విశేషాలుసవరించు

 
మాయబజారు సినిమాలో సావిత్రి

అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.

అపజయాలుసవరించు

మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. వీరి అభిప్రాయ బేధాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది.[3] తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్ తో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థికపతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్‌కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.

మహానటి చిత్రంసవరించు

సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో "మహానటి" అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించింది, ఈ చిత్రమునకు ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.

ఆమె సినిమాలుసవరించు

నటిగాసవరించు

 1. సంసారం (1950)
 2. అగ్నిపరీక్ష (1951)
 3. పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
 4. పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
 5. పల్లెటూరు (1952)లో సుగుణ
 6. ప్రతిజ్ఞ (1953)
 7. దేవదాసు (1953)లో పార్వతి
 8. బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
 9. మేనరికం (1954)
 10. చంద్రహారం (1954)లో చంచల
 11. బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
 12. పరివర్తన (1954)లో సుందరమ్మ
 13. వదిన (1955)
 14. మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
 15. మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
 16. అర్ధాంగి (1955)
 17. సంతానం (1955)లో శారద
 18. కన్యాశుల్కం (1955)లో మధురవాణి
 19. దొంగరాముడు (1955)లో సీత
 20. చరణదాసి (1956)లో లక్ష్మి
 21. భలేరాముడు (1956)
 22. అమరదీపం (1956)లో అరుణ
 23. వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
 24. తోడికోడళ్ళు (1957)లో సుశీల
 25. ఎమ్మెల్యే (శాసన సభ్యులు.) (1957)లో నిర్మల
 26. భలే అమ్మాయిలు (1957)
 27. మాయాబజార్ (1957)లో శశిరేఖ
 28. మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
 29. కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
 30. మాంగల్యబలం (1958)
 31. అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
 32. భాగ్యదేవత (1959)
 33. నమ్మిన బంటు (1959)
 34. అభిమానం (1960)
 35. విమల (1960)
 36. శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
 37. శాంతినివాసం (1960)
 38. దీపావళి (1960)
 39. చివరకు మిగిలేది (సినిమా) (1960)లో పద్మ
 40. మావూరి అమ్మాయి (1960) (తమిళ సినిమా)
 41. పాపపరిహారం (1961)
 42. పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
 43. పాండవవనవాసం (1961)లో ద్రౌపది
 44. కలసివుంటే కలదుసుఖం (1961)
 45. సిరిసంపదలు (1962)
 46. పవిత్ర ప్రేమ (1962) (తమిళ సినిమా)
 47. మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
 48. మంచిమనసులు (1962)
 49. ఆరాధన (1962)లో అనూరాధ
 50. గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
 51. రక్తసంబంధం (1962)
 52. ఆత్మబంధువు (1962)
 53. నర్తనశాల (1963)లో ద్రౌపది
 54. కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
 55. ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
 56. చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
 57. రక్తతిలకం (1964)లో కమల
 58. మూగ మనసులు (1964)లో రాధ
 59. కర్ణలో (1964) భానుమతి
 60. వెలుగునీడలు (1964)లో సుగుణ
 61. పూజాఫలం (1964)లో సీత
 62. నవరాత్రి (1964)
 63. కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
 64. గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
 65. డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
 66. దేవత (1964)
 67. సుమంగళి (1965)
 68. తిరువిలయాదల్ (1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
 69. నాదీ ఆడజన్మే (1965)
 70. మనుషులు మమతలు (1965)
 71. నవరాత్రి (1966)
 72. భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
 73. ప్రాణమిత్రులు (1967)
 74. వరకట్నం (1968)
 75. తల్లితండ్రులు (1970)లో కౌసల్య
 76. మరోప్రపంచం (1970)
 77. అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
 78. అందాలరాజా (1977) (తమిళ సినిమా)
 79. జగన్మోహిని (1978)
 80. అమర ప్రేమ (1978)
 81. అల్లావుద్దీన్ అద్భుత దీపం (1979) (తమిళ సినిమా)
 82. అందరికంటే మొనగాడు (1985)
 83. దేవదాసు మళ్లీ పుట్టాడు
 84. పూజ
 85. రామాయణంలో పిడకలవేట
 86. పునాది రాళ్లు
 87. గోరింటాకు (చివరి సినిమా)1979

నిర్మాతగాసవరించు

 1. ఏక్ చిట్టీ ప్యార్ భరీ (1975) (హిందీ సినిమా)

దర్శకురాలిగాసవరించు

 1. చిన్నారి పాపలు (1968)
 2. కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం
 3. మాతృదేవత (1969)
 4. చిరంజీవి (1969)
 5. వింత సంసారం (1971)
 6. ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం

ఇతరములుసవరించు

 1. నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని


ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. V.R.Murthy, V.Soma Raju (2009). A legendary Actress Mahanati Savitri (in English). Upstate Harbor Publishers. ISBN 978-06-1528-096-7. Cite has empty unknown parameters: |accessyear=, |origmonth=, |accessmonth=, |month=, |chapterurl=, |origdate=, and |coauthors= (help); |access-date= requires |url= (help)CS1 maint: unrecognized language (link)
 2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 110. |access-date= requires |url= (help)
 3. "ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి". eenadu.net. ఈనాడు. Archived from the original on 12 August 2018. Retrieved 12 August 2018.

వనరులుసవరించు