రొయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
==వ్యుత్పత్తి==
వివిధ ఆంగ్ల భాషలలో ప్రాన్ (“prawn”) పేరు ష్రింప్ కూడా ఉపయోగించారు. అయితే పెద్దవాటిని ప్రాన్ గా భావిస్తారు. ఉదాహరణ: ''Leander serratus''. [[అమెరికా]]లో 1911 ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ప్రాన్ సాధారణంగా మంచినీటిలో నివసించే ప్రాన్ లేదా ష్రింప్ కు ఉపయోగిస్తారు. సముద్రజలాల్లో మరియు ఉప్పు కయ్యల్లో నివసించే వాటిని ష్రింప్ అంటారు. తెలుగులో రెండింటినీ కలిపి "రొయ్యలు" అంటారు.
 
==జబ్బులు==
8 జూలై 2011 నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యలకు తెల్లమచ్చ (వైట్‌స్పాట్) వ్యాధి సోకింది. సుమారు 300 ఎకరాల రొయ్యల చెరువులకు ఈ వ్యాధి సోకడంతో సుమారు రూ.4కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆకివీడు మండలంలోని చినకాపవరం గ్రామంలోని సుమారు 300 ఎకరాల రొయ్యల చెరువులపై ఈ వ్యాధి ప్రభావం పడిందని ప్రాథమిక అంచనా. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో రొయ్యల సాగుపై రైతులు దృష్టి సారించారు. నూతన పద్ధతులను అవలంబించి సాగు చేస్తున్నారు.[[ టైగర్ రొయ్యల ]]తో పాటు [[ వనామి]] రకం రొయ్యలను కూడా సాగుచేస్తున్నారు. అయితే గత పది రోజులుగా వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులతో ఈ ప్రాంత రొయ్యల రైతులు రొయ్యలకు ఆక్సిజన్ అందించే పనిలో రేయింబవళ్లు నిమగ్నమయ్యారు. గత రెండు రోజులుగా రొయ్యలకు తెల్లమచ్చ (వైట్‌స్పాట్) వ్యాధి సోకినట్టు వెల్లడవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యాధి సోకిన రొయ్యల అవశేషాలను పక్షులు తీసుకువచ్చి వేరే చెరువుల్లో వదిలితే క్రమేపీ మిగతా రొయ్యలకు సోకుతుంది.
 
* రెండు రోజుల క్రితం చినకాపవరం ప్రాంతంలోని సుమారు 100 ఎకరాల రొయ్యల చెరువుల్లో ఈ వ్యాధి ప్రభావం కనిపించింది. దీంతో ఆ చెరువుల యజమానులు వెంటనే పట్టుబడి ప్రారంభించారు. ఇది మొదలు మిగిలిన రొయ్యల చెరువులకు కూడా ఈ వ్యాధి సోకడంతో చినకాపవరం ప్రాంతంలోని రొయ్యల చెరువులు మొత్తం ఈ వ్యాధిబారిన పడి రైతులు కోట్ల రూపాయల మేర నష్టపోయారు. రొయ్యలకు సోకిన వ్యాధి నివారణకు సరైన మందులు లేకపోవడంతో రొయ్యలపై ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పట్టుబడి సాగిస్తున్నారు. చినకాపవరం గ్రామంలోని సుమారు 130 ఎకరాల రొయ్యల చెరువుల్లో 35 కౌంట్‌కు వచ్చిన రొయ్యలపై ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా కనపడింది.
 
* వ్యాధి సోకిన రొయ్యలు పూర్తిగా ఎరుపురంగులోకి మారడంతో రైతులు వీటిని అమ్మే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో వీటిని దూరప్రాంతాలకు తీసుకువెళ్ళి భూమిలో కప్పిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు ఈ తరహా వ్యాధిసోకిన రొయ్యలను క్యాట్‌ఫిష్ చెరువులకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
 
* ప్రస్తుతం 35కౌంట్ రొయ్యలకు కిలో రూ.300 ధర పలుకుతోంది. చినకాపవరం ప్రాంతంలోని దాదాపు చెరువులన్నిటిలో తెల్లమచ్చవ్యాధి సోకి రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. తెల్లమచ్చ వ్యాధిసోకి రొయ్యలు చనిపోవడంతో రొయ్యల చెరువులు సాగుచేస్తున్న ప్రాంతమంతా దుర్గంధం వ్యాపిస్తోంది. దీనితో రైతులంతా బ్లీచింగ్ చల్లి, వాతావరణ కాలుష్యాన్ని నివారించే పనిలో పడ్డారు. ఇదే తరహాలో జిల్లాలోని పలుప్రాంతాల్లో రొయ్యల సాగుపై ఈ వ్యాధి ప్రభావం పడిందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే నష్టం భారీగా ఉండే ప్రమాదముంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రొయ్య" నుండి వెలికితీశారు