Talapagala VB Raju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png వైజాసత్య 18:07, 9 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మౌలిక పరిశోధనలు ఎందుకు నిషిద్ధం?

వికీపీడియా మూడు ముఖ్య విధానాలలో - వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:నిర్ధారింప తగినది సరే. అర్ధం చేసుకోవచ్చును. కాని మౌలిక పరిశోధనలు ఎందుకు నిషిద్ధం? వాటిపై అభ్యంతరం ఎందుకుండాలి?

వికీపీడియా విషయ విధానాలు మూడూ కూడా తటస్థ దృక్కోణంకు అవుసరార్ధమే రూపొందించబడ్డాయి. ఇందుకు Wikipedia:Core content policies లో ఇచ్చిన వివరణను గమనించండి. - Soon it became evident that editors who rejected a majority view would often marshal sources to argue that a minority view was superior to a majority view—or would even add sources in order to promote the editor's own view. Therefore, the No Original Research (NOR) policy was established in 2003 to address problematic uses of sources. The original motivation for NOR was to prevent editors from introducing fringe views in science, especially physics — or from excluding verifiable views that, in the judgement of editors, were incorrect. It soon became clear that the policy should apply to any editor trying to introduce his or her own views into an article (and thus a way to distinguish Wikipedia from Everything).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మా తెలుగు తల్లిసవరించు

- శంకరంబాడి సుందరాచార్య గారు రచించిన 'మా తెలుగు తల్లి' పాట - ఈ తెలుగు తల్లి పాటను తగిన స్థానంలో ఉంచమని కోరుతున్నాను. Talapagala VB Raju 18:35, 10 ఫిబ్రవరి 2008 (UTC)

ఈ గీతం ఇప్పటికే ఉన్నది ఈ [లింకులో] అందువలన దీనిని తొలగిస్తున్నాను.విశ్వనాధ్. 05:16, 11 ఫిబ్రవరి 2008 (UTC)

బౌధ్ధమతం, మహాయానం, హీనయానం, వజ్రయానం అనే మూడు శాఖలుగా చీలిపోయింది.

ఇస్లాం మతం లో, షియాలు, సున్నీలు అనే వారు ఉన్నారు.

మతాలు శీర్షికలో, జొరాస్ట్రియన్ మతం, షింటో మతం, కూడా చేర్చవచ్చును.

తలపాగల విబి రాజు~~

చేర్చవచ్చు. వాటికి మొదలుగా పేజిలు తయారు చేయాలి. బౌద్ధమతము మీద్స ఆసక్తి ఉంటే మీరు మొదలు పెట్టవచ్చు... అందరు తలోచేయి వేస్తారు.

సహాయ అభ్యర్ధనసవరించు

[[సహాయం కావాలి]]

బౌద్ధమతం పేరుతో శీర్షిక వుంది. కానీ, 'బౌద్ధమతం' అని టైపు చేసి 'వెళ్ళు' అని క్లిక్ చేస్తే, ఆ పేరుతో ఏమీ లేదు. మీరు కొత్త పేజీని మొదలు పెట్టండి అని వస్తుంది. కారణం ఏమిటిTalapagala VB Raju 17:45, 22 ఫిబ్రవరి 2008 (UTC)

బౌద్ధ మతము పేరుతో వ్యాసం ఉంది. పేరులో కొద్దితేడా వచ్చిననూ ఆ వ్యాసం రాదు. అయిననూ దారిమార్పు పేజీ చేస్తానులెండి.----C.Chandra Kanth Rao 18:02, 22 ఫిబ్రవరి 2008 (UTC)
బౌద్ధమతం పై కల వ్యాసాలు కావాలంటే ఇక్కడ చూడండి.----C.Chandra Kanth Rao 18:09, 22 ఫిబ్రవరి 2008 (UTC)

సంతకంసవరించు

సంతకాన్ని కేవలం చర్చాపేజీల్లో ఉపయోగించండి. వ్యాసాల్లో సంతకాలు చెయ్యద్దు. వ్రాసినవాళ్ళందరూ సంతకాలు చేస్తూపోతే విషయం తక్కువ, సంతకాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది! --వైజాసత్య 19:02, 29 జూన్ 2008 (UTC)

చరిత్రలో ఈ రోజు శీర్షికసవరించు

రాజు గారూ! నమస్కారం. చరిత్రలో ఈ రోజు శీర్షిక ఉత్సాహంగా మెయింటెయిన్ చేస్తున్నందుకు అభినందనలు. ఈ విభాగంపై చంద్రకాంతరావు గారు మినహా పెద్దగా ఎవరూ శ్రద్ధ పెట్టలేదు. మీ కృషితో ఇది బాగా మెరుగు పడుతుందని ఆశిస్తాను. బౌద్ధ మతము చాలా భాగం అనువదించాను. మిగిలిన భాగం మీకు వీలయితే ప్రయత్నించగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:57, 5 జూలై 2008 (UTC)

మంచి పని, ధన్యవాదాలు. అర్జున 16:15, 16 జూన్ 2010 (UTC)

అణా బొమ్మసవరించు

రాజుగారూ! మీ అనుమతి తీసుకోకుండా మీ సభ్యుని పేజీలో ఒక బొమ్మ చేర్చాను. మీకు ఇష్టమవుతుందనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 12 జూలై 2008 (UTC)

ధన్యవాదాలు కాసుబాబు గారు.ఈ అణా బొమ్మను చూసి, నేటి తరం, రాబోయే తరాలు, తమ తెలుగు జాతి గొప్పతనాన్ని చూసి గర్వపడతారుTalapagala VB Raju 15:55, 16 జూన్ 2010 (UTC) స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ 21 నవంబర్ 1947 లో విడుదలయింది. దీని విలువ మూడున్నర అణాలు.


అభినందనలుసవరించు

రాజుగారూ! "చరిత్రలో ఈ రోజు" శీర్షికకు చాలా వేగంగా అనేక ఘటనలు జోడించినందుకు అభినందనలు. ఈ శీర్షిక ప్రధాన నిర్వహణ మీరు వహిస్తే చాలా బాగుంటుంది. ఇతర సభ్యులు చాలా బిజీగా ఉన్నట్లున్నారు. --కాసుబాబు 10:12, 19 జూన్ 2010 (UTC)

కాసుబాబు గారు! కృతజ్ఞతలు. నా శాయశక్తులా ప్రయతిస్తానండి. Talapagala VB Raju 10:43, 19 జూన్ 2010 (UTC)

తేదీ వ్యాసాలుసవరించు

రాజు గారు, మీరు తేదీ వ్యాసాలలో అన్నింటిలో చరిత్రలో ఈ రోజుకు లొంకి ఇస్తున్నారు. అది అవసరం లేదనుకుంటా, అయిననూ ఆ పని చేతితో కాకుండా వైజాసత్య గారికి తెలిపితే బాటు ద్వారా తేలికగా చేరుస్తారు. -- C.Chandra Kanth Rao-చర్చ 09:34, 20 జూన్ 2010 (UTC)

చరిత్రలో ఈ రోజు శీర్షికలో ప్రాధాన్యత ఉన్న కొన్ని విషయాలనే చేరుస్తాము, తేదీ వ్యాసాలలో చాలా విషయాలు ఉండవచ్చు. తేదీ వ్యాసాలలో ఉండే విషయాలు చరిత్రలో ఈ రోజు శీర్షికలో తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. అలాంటప్పుడు తేదీ వ్యాసాల లింకులు ఆ శీర్షికకు ఇచ్చే అవసరం ఉండదనుకుంటా. -- C.Chandra Kanth Rao-చర్చ 09:38, 20 జూన్ 2010 (UTC)

నేను వైజా సత్య గారికి తెలియ చేస్తాను. తేదీ వ్యాసాల వివరాలు, చరిత్రలో ఈ రోజు శీర్షిక లో కొన్ని లేవు. అవి చూసిన తరువాత, 'ఈ రోజు సశీర్షికలో మరలా టైపు చేసేకంటే, లింకు ఇస్తీ మరిన్ని వివరాలు తెలుస్తాయని లింక్ ఇస్తున్నాను. Talapagala VB Raju 10:49, 20 జూన్ 2010 (UTC)

పైన నేను వ్రాయడంలో కొద్దిగా పొరపాటు జరిగింది. చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఉన్న అన్ని విషయాలు తేదీ వ్యాసాలలో ఉంటాయి, ఉండాలి కూడా. తేదీ వ్యాసాలలో ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్న విషయాలు రేపు వందలు దాటవచ్చు, కాని వాటన్నింటినీ చరిత్రలో ఈ రోజు శీర్షికలో చేర్చలేము కదా! అందులో ప్రధానమైన కొన్ని (నా దృష్టిలో గరిష్టంగా 10 చాలనుకుంటున్నాను) మాత్రమే చేరిస్తే చాలు. సంవత్సర మరియు తేదీ వ్యాసాలు ఇంకనూ అభివృద్ధి దశలో ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వాటిలో సమాచారం చేరుస్తున్నాను. ప్రధానమైన విషయాలు ఇంకనూ చేరవచ్చు. కాబట్టి నేను తేదీ వ్యాసాలు, సంవత్సర వ్యాసాలలో మాత్రమే విషయాలు చేరుస్తూ, చరిత్రలో ఈ రోజు శీర్షికక వదలివేస్తున్నాను. చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఇప్పటికే అధిక సంఖ్యలో విషయాలు ఉంటే రేపు ప్రధానమైన విషయాలు చేర్చాల్సి ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని విషయాలు తొలిగించాల్సి రావచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 11:03, 20 జూన్ 2010 (UTC)

ఛంద్రకాంతరావు గారు! నన్ను కూడా ' చరిత్ర లో ఈ రోజు శీర్షిక' వదిలేసి, 'తేది, వ్యాసాలలో' కొత్త విషయాలు చేర్చమంటా రా़ మీరు సలహా ఇచ్చి, కొంచెం దారి చూపండి. Talapagala VB Raju 11:16, 20 జూన్ 2010 (UTC)

సరే అలాగే చేయండి, నా వద్ద సమాచారం ఉన్ననూ సమయం లేనందువల్ల ఎక్కువగా చేర్చలేక పోతున్నాను. మీరు సంవత్సర మరియు తేదీ వ్యాసాలలో ముందుగా కృషి చేస్తే ఆ తరువాత అందులోని ముఖ్యమైన విషయాలను ఆ శీర్షికలో పెట్టవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 11:25, 20 జూన్ 2010 (UTC)

ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా, సంవత్సర మరియు తేదీ వ్యాసాలలో ముందుగా కృషి చేస్తానండి. Talapagala VB Raju 11:30, 20 జూన్ 2010 (UTC)

సహాయ అభ్యర్ధనసవరించు

కాపీ రైట్ హక్కు గురించి వివరాలు చెప్పండిసవరించు

ఏ వ్యాసమైనా, రఛయిత పేరుతో వుంటే కాపీ రైట్ హక్కు వున్నట్లే. ఆ రచన , ఆ రఛయిత అనుమతితో మాత్రమే ప్రచురించాలని మాత్రం నాకు తెలుసు.దిన పత్రికలలో వచ్చే వార్తలు, విశేషాలు (విలేకరులు, డెస్క్ సంపాదకులు) మన వికీపీడియా లో చేర్చవచ్చునా. కొన్ని సార్లు, వింతలు విశేషాలు, చిట్కాలు, వంటివి రఛయిత పేరు లేకుండా ప్రచురిస్తారు. అటువంటివి, పత్రికల నుంచి, వార, మాస పత్రికల నుంచి సేకరించి వికీపీడియా లో చేర్చవచ్చునా . చేరిస్తే కాపీ రైట్ హక్కుని ఉల్లంఘించినట్లుగా బావిస్తారా! వివరంగా చెప్పండి. ఎక్కువ వివరాలు ఏదైనా వెబ్ లింక్ వుందా? ప్రాచీన గ్రంధాలైన భగవద్గీత, భర్తృహరి సుభాషిత శతకం వంటివి ప్రాచీనులు రచించినవి. భర్తృహరి సుభాషిత శతకాన్ని ఆంధ్రీకరించిన కవులు వున్నారు. వారి ఆంధ్రీకరణలు (భర్తృహరి సుభాషిత శతకం)వికీపీడియాలో చేర్చవచ్చునా! కాపీ రైట్ హక్కు ఎన్ని సంవత్సరాలు వుంటుంది. ఏదైనా వెబ్ సైట్ లోని విషయం తెలుగులో అనువదించి వికీపీడియా లో చేర్చవచ్చునా. లేదంటే ఆ వెబ్ సైట్ వారి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకోవాలంటే , ఆ పద్ధతి ఎలా? Talapagala VB Raju 16:13, 4 జూలై 2010 (UTC)

రాజు గారూ, ఏదైనా పుస్తకం నుంచి కానీ, పత్రిక నుంచి కానీ మీరు వికీపీడియాలోకి పూర్తి వ్యాసాన్ని యధాతథంగా కాపీ చేసేటపుడు అనుమతి తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఏ ఒక్క లైనో, పేరాగ్రాఫ్ అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. లేదా అవి చదివి అర్థం చేసుకుని మీరు స్వంతంగా రాసే పనైతే అసలు కాపీ హక్కుల సమస్యే ఉండదు.
  • ఏ భాషనుంచైనా అనువదించి వికీలో చేర్చడానికి అనుమతి అవసరం లేదనుకుంటా
  • శతక సాహిత్యం, కవితలు మొదలైన వాటిని యధాతథంగా వికీపీడియాలో చేర్చే వీలు లేదు గానీ వికీసోర్స్ లో చేర్చవచ్చును.

--రవిచంద్ర (చర్చ) 18:11, 4 జూలై 2010 (UTC)

1.ఏ వ్యాసమైనా రచయిత పేరుమీదుగా ఉన్నంత మాత్రానా అది కాపీ రైట్ హక్కులు పొందిఉంటారని కాదు, కాని భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉండాలంటే మాత్రం అనుమతి లేని వ్యాసాన్ని యధాతథంగా తీసుకోకపోవడం ఉత్తమం.
2.సాధారణంగా పత్రికలలో వచ్చే వార్తాంశాలకు కాపీ హక్కులుండవు, కానీ ఆంగ్లంలో ఉన్న వార్తలను ఒక్కోపత్రిక ఒక్కక్క శైలిలో అనువదిస్తూ స్వంత కథనాలను జోడిస్తూ ఉంటుంది. కాబట్టి యధాతథంగా వార్తలను తీసుకోకపోవడం ఉత్తమం.
3..పత్రికలలో వచ్చే వార్తేతర అంశాలు అనగా వింతలు, విశేషాలు, చిట్కాలు, ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు, విలేకరులు సేకరించిన సమాచారం మున్నగునవి పత్రికవారికే స్వంతంగా చెందుతుంది కాబట్టి వాటిని అనుమతి లేనిదే పూర్తిగా కాపీచేయడం తప్పు.
4.కాపీరైట్ హక్కుల కాలం దేశాన్ని బట్టి మారుతుంది, ఇది సాధారణంగా 60 నుంచి 100 సం.ల వరకు ఉంటుంది
5.ఇతర వెబ్‌సైట్‌లలోని సమాచారం అనుమతి లేకుండా యధాతథంగా అనువదించి తెవికీలో చేర్చడం కూడా తప్పే, అది కాపీహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ఇతర భాషల వికీపీడియాల నుంచి మాత్రం అనువాదం చేసి తెవికీలో చేర్చవచ్చు
6.కాపీ హక్కులు ఉన్న గ్రంథాల నుంచి తెవికీలో కొన్ని వాక్యాలు మాత్రం (పేరాలు కాదు) తీసుకోవచ్చు, వాటికి రెఫరెన్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు.
7.కాపీరైట్ హక్కులు ఉన్న ఒక వ్యాసాన్ని, కథనాన్ని చదివి అర్థం చేసుకొని స్వంతంగా వ్రాయవచ్చు కాని అది అంతవరకు ప్రచురితం కాని కొత్త కథనమైతే మాత్రం, అది రచయిత ప్రత్యేకతకు సంబంధించినదైతే మాత్రం అలా చేయడానికి వీలుండదు. గ్రంథాలకు మాత్రం విశ్లేషణ చేయవచ్చు.
8.మరిన్ని వివరాల కోసం వికీపీడియా:కాపీహక్కు ప్రశ్నలు మరియు Wikipedia:FAQ/Copyright చూడండి. C.Chandra Kanth Rao-చర్చ 18:58, 4 జూలై 2010 (UTC)
చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలో రెండవ పాయింట్ సరికాదు. వార్తాపత్రిక లన్నిటికి నకలుహక్కులుంటాయి. యథాతథంగా నకలు చేస్తే అతిక్రమించినట్లే. -- అర్జున 05:30, 10 జూలై 2011 (UTC)

సహాయ అభ్యర్ధనసవరించు

{{సహాయం కావాలి}}

తేదీలు - వ్యాసాలుసవరించు

తేదీలు వ్యాసాలలో (12 నెలల తేదీలు), వర్గం : నెలలు వ్యాసాలలో కనిపించవలసిన మూసలు, కనిపించటం లేదు. ఎర్రని అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వర్గం : ఫిబ్రవరి నెల వ్యాసం లో మాత్రమే ఫిబ్రవరి నెల క్యాలండర్ కనిపిస్తుంది. మిగతా వర్గం: నెలలు (11 నెలలు), తేదీల వ్యాసాలలో ఆ నెల క్యాలండర్ కనిపించాలంటే, ఏమి చేయాలో చెప్పండి. Talapagala VB Raju 08:11, 5 జూలై 2010 (UTC)

రాజుగారు, నేను జులై నెలకోసం ప్రయత్నించి చూశాను. దీనికోసం ఈ మూసలు మార్చాలి {{జులై క్యాలెండర్}} {{జులై క్యాలెండర్2010}} {{జూలై క్యాలెండర్‌2010మూలము}} చివరి దానిలో నెలకున్నరోజులు, ప్రారంభ వారం, నెలపేరు మార్చాలి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనది. ఇంగ్లీషు వికీలో మూస ప్రోగ్రామ్ ద్వారా ఏ సంవత్సరానికైనా కాలెండర్ రూపొందించారు. అది మన తెలుగులోకి మార్చితే బాగుంటుంది.--అర్జున 13:36, 20 జూలై 2010 (UTC)
ఆర్జున గారు, మీరు చెప్పినట్లుగా ఆగష్టు మూసలు మార్చాను. ఏదో పొరపాటు వలన ఆగష్టు క్యాలెండరు వెబ్‌పీజీలో కనిపించటము లేదు. ఆ పొరపాటు ఏమిటో కొంచెంచూసి చెబితే, మిగిలిన నెలల మూసలు కూడా నేను చేస్తాను. ఇంగ్లీషు వికీలో మూస ప్రోగ్రామ్ ద్వారా ఏ సంవత్సరానికైనా కాలెండర్ చేయటం కూడా మీ సహాయంతో తర్వాత ప్రయత్నం చేద్దాం. Talapagala VB Raju 02:43, 27 జూలై 2010 (UTC)
నేను సరిచేశాను.--అర్జున 08:35, 20 ఆగష్టు 2010 (UTC)
అర్జునగారు, 2010 సంవత్సరంలోని మిగిలిన నెలలకు మూసలు చేసాను. అన్నీ బాగా పనిచేస్తున్నాయి. మనం ప్రతీ సంవత్సరానికి నెలల మూసలు చేయమంటే వీలుని బట్టి చేస్తాను.మీరు చెప్పినట్టు, "ఇంగ్లీషు వికీలో మూస ప్రోగ్రామ్ ద్వారా ఏ సంవత్సరానికైనా కాలెండర్ రూపొందించారు. అది మన తెలుగులోకి మార్చితే బాగుంటుంది " మీరేమైనా దారి చూపితే నేను చేయాలని అనుకుంటున్నాను. ఎలా చేయాలో దారి చూపండి. Talapagala VB Raju 15:38, 28 ఆగష్టు 2010 (UTC)
    • తేదీల మీద, నెలలు మరియు సంవత్సరాల మీద వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఆంగ్ల వికీపీడియాలో ఉన్న సమాచరంలో కొంతవరకు మన తెలుగు వారికి సంబంధించిన దానిని మాత్రమే చేరిస్తే బాగుంటుంది. నేను ఏమైనా సహాయం చేయాలంటే తెలియజేయండి.Rajasekhar1961 06:29, 19 ఫిబ్రవరి 2011 (UTC)
    • కృతజ్ఞతలు. చిన్న సవరణ తెలుగు వారికి బదులుగా భారతీయులు, భారత దేశానికి సంబందించిన వాటిని మాత్రమే చేర్చాలనుకుంటున్నాను. మీరు సలహా ఇవ్వండి.అలాగే ఒక్క నెల కేలండర్ మోడల్ ఎవరైనా తయారుచేస్తే, మిగిలిన నెలలు నేను తయారు చేస్తానండి. Talapagala VB Raju 09:23, 21 ఫిబ్రవరి 2011 (UTC)

శిక్షాస్మృతిసవరించు

భారతీయ శిక్షాస్మృతి వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు. దీనిలోని ప్రతి సెక్షన్ లోను వర్గీకరించిన నేరాలు గురించి కూడా కొన్ని ప్రాథమిక నిర్వచనాలు కూడా సంబంధించిన వ్యాసాలలో వివరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 08:50, 14 జూన్ 2011 (UTC)

మీసలహాకు ధన్యవాదాలు. ఆ ప్రయత్నం కూడా చేస్తాను. కొద్ది కొద్దిగా సేకరిస్తున్నాను. న్యాయశాస్త్ర పరిభాష అనువాదం చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంది. Talapagala VB Raju 09:29, 14 జూన్ 2011 (UTC)

తేదీ వ్యాసాలలో బయటి లింకులు మే 1కి?సవరించు

వీరభద్ర రాజు గారూ,

తేదీ వ్యాసాలలో బయటి లింకులను మే 1 వ తేదీకి మారుస్తున్నారు. ఉదాహరణలు: [1], [2], [3]. ఎందుకని?

ఈ మార్పులను రద్దుచేసే ముందు, వీటిని ఎందుకు చేసారో తెలుసుకోవాలనుకుంటున్నాను. — వీవెన్ 02:18, 10 జూలై 2011 (UTC)

ఇది వ్యాపారం పెంచుకోటానికి ఉద్దేశించిన మార్పులు లాగా వుంది. ఎందుకంటే ఇంగ్లీషు వ్యాసాలలో ఈ సైట్ లింకు ఇవ్వలేదు. ఈ లింకులో వారి స్వంత సైటు వ్యాసాలు తప్ప ప్రజోపయోగ సైటులకు లింకులు లేవు. బిబిసి సైటు పరవాలేదు టిఎన్ఎల్ సైటు లింకులు తొలగించతగినవిగావున్నాయి. విబిరాజు గారు ఒక వారం రోజులలో స్పందించండి, మీకు అభ్యంతరాలు ఏమన్నావుంటే. -- అర్జున 05:05, 10 జూలై 2011 (UTC)
అర్జునరావు గారూ, TNL లంకె ముందు నుండే ఉన్నట్టుంది. వీరు తేదీలను మే 1కి మార్చారు. — వీవెన్ 07:43, 10 జూలై 2011 (UTC)
  • నాకేమీ అబ్యంతరంలేదండి. వికీపీడియా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే దయచేసి తొలగించండి. నా ఉద్దేశం సాద్యమైనంత ఎక్కువ లింకులను ఇవ్వటం, 365 రోజులకు ఆ లింకులను చేర్చటము మాత్రమే. 365 రోజులకు ఒకేసారి లింకులు ఇవ్వటం కష్టమని, సంవత్సరంలోని ప్రతీ నెలా మొదటి రోజుకి అన్ని లింకులనూ చేర్చాను. ఈ రోజున జూలై నెలలోని 31 రోజులకు బయటి లింకులను చేర్ఛానండి. Talapagala VB Raju 10:27, 10 జూలై 2011 (UTC)
మీ స్పందనకు ధన్యవాదాలు.చరిత్రలో ఈ రోజు గురించి మీరు చేస్తున్నకృషి శ్లాఘనీయం. కాకపోతే వాణిజ్యప్రయోజనాలకు నేరుగా వాడుకోటాన్ని ప్రోత్సహించకూడదు ఎందుకంటే విజ్ఞాన సర్వస్వ రూపం మారిపోతుంది కాబట్టి. ఈ వ్యాసాలకు మీరు ప్రత్యేక కృషి చేస్తున్నారు కాబట్టి, ఆ లింకులు ఎవరి చేర్చినది తెలిస్తే తెలియచేయండి. వారితో చర్చించి తరువాతి అడుగు వేయవచ్చు. -- అర్జున 13:08, 10 జూలై 2011 (UTC)
  • టి.ఎన్.ఎల్. లింక్ కూడా నేనే చేర్చానండి. తేదీలు, సంవత్సరాల గురించి వివరం ఇస్తుంది, ఆసక్తి ఉన్నవారికి పనికి వస్తుంది, లింక్ వెంటనే దొరుకుతుంది అన్న ఉద్దశంతో మాత్రమే ఈ లింక్ చేర్చానండి. వాణిజ్యప్రయోజనమైన వెబ్ సైట్ అన్న ఆలోచన నాకు రాలేదు (తెలియదు కూడా) అందుకని ఈ వెబ్ సైట్ ని తొలగించండి. భవిష్యత్తులో నా రచనలలో ఇటువంటి వాణిజ్య ప్రయోజనాల వెబ్ సైట్లు ఉంటే వెంటనే తొలగించండి. నా అనుమతి అవసరంలేదు. ఎందుకంటే వాణిజ్య ప్రయోజనాల వెబ్ సైట్ లను ఎలా గుర్తించాలో నాకు తెలియదు. అలాగే, మిగిలిన లింకులు అన్నీ 365 రోజులకు ఏదైనా బ్లాటు ద్వారా ఇస్తే, చదువరులకి ప్రయోజనంకలుగుతుందని నా ఆశ. ఈ విషయంలో నాకు దారి చూపించిన వారందరికీ నా కృతజ్ఞతలు. Talapagala VB Raju 01:46, 13 జూలై 2011 (UTC)

బీడు భూమిసవరించు

బీడు భూమి నకలు హక్కుల అతిక్రమణకు తొలగింపునకు ప్రతిపాదించబడినది. స్పందించండి. -- అర్జున 05:25, 10 జూలై 2011 (UTC)

అయితే తొలగించండి. ఈ పత్రికలో ఇచ్చిన డాటా చాలా వివరంగా ఉన్నది. వెశ్లేషణాత్మకంగా ఉన్నది. దీనిని మరొక విధంగా, అంటే, భారతదేశపు భూమిలోని బీడు భూముల వివరాలను, వివరింఛటం ఏమైనా వీలుంటే సలహా ఇవ్వండి. Talapagala VB Raju 10:23, 10 జూలై 2011 (UTC)

గణాంకాలు తీసుకొని, మీరు వేరేగా వ్యక్తపరచండి. ప్రైవేటు సంస్థల మూలాలకన్నా ప్రభుత్వ మూలాలు మంచిది. --అర్జున 13:10, 10 జూలై 2011 (UTC)
  • అలాగే చేస్తానండి. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ లేండ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ని భారత ప్రభుత్వం 1992 లో మొదలు పెట్టింది. ఆ వెబ్ సైట్ నుంచి , ఆ మంత్రిత్వ శాఖనుంచి వివరాలు సేకరిస్తున్నానండి. విషయ సేకరణ తరువాత ఈ వ్యాసాన్ని సరిదిద్దుతానండి. దారి చూపినందుకు కృతజ్ఞతలు. Talapagala VB Raju 01:51, 13 జూలై 2011 (UTC)

Invite to WikiConference India 2011సవరించు


Hi Talapagala VB Raju,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

వార్డులుసవరించు

విశాఖపట్నం వార్డులు వ్యాసం బాగా రచించారు. వైజాగ్ లోని అన్ని ప్రాంతాలు జోన్ల వారీగా విభజించబడ్డాయి. అలాగే హైదరాబాదు వార్డులు వ్యాసాన్ని రచించమని మనవిచేస్తున్నాను. ఇది ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఆ ప్రాంతంలోని సమస్యలని నివేదించాల్సిన అధికార్లను చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.Rajasekhar1961 06:19, 13 సెప్టెంబర్ 2011 (UTC)

కృతజ్ఞతలండి. నేను విశాఖపట్నంలో చాలా కాలం నుంచి నివశిస్తున్నాను. చాలా విషయ సేకరణ స్వయంగాను, స్థానిక పత్రికలద్వారాను, స్వయంగా ఆయా ప్రాంతాలు తిరగటంద్వారాను సేకరించిన విషయాలను క్రమబద్ధంగా రాయగలిగానండి. హైదరాబాదు అనేసరికి, ఆ ప్రాంతంగురించిన నాకు అవగాహన తక్కువండి. అంతర్జాలంలో కూడా హైదరాబాదు వార్డుల గురించి ఏమైనా విషయ సేకరణకు వీలు కుదిరితే, నేను తప్పక రాస్తానండి. పూర్తిగా న్యాయం చేయలేకపోయినా, కొంతమేరకైనా , లేదంటే మొదలైనా పెడతానండి. ఇకముందు నుంచి సమాచార సేకరణ మొదలు పెడతానండి. విశాఖపట్నం గురించి రాయవలసినది చాలా వుందండి. భారత దేశపు చట్టాల గురించి, భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ ఎవిడెన్స్ (సాక్ష్య)) చట్టము, భారతీయ సివిలి ప్రొసీజర్ కోడ్, ల గురించి సమాచార సేకరణ చేస్తున్నానండి. ఈ చట్టాల గురించిన సమాచారం కొంతైనా నేను మొదలు పెడితే, కాలక్రమంలో అది సంపూర్ణమౌతుందని నా నమ్మకం, ఆశ. మరొక్కసారి నా కృతజ్ఞతలు. Talapagala VB Raju 08:49, 12 అక్టోబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్సవరించు

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -అర్జున 09:44, 18 డిసెంబర్ 2011 (UTC)

అర్జున గారు, వెబ్ ఛాట్ లో తప్పక చేరతానండి. ఇంత మంచి కృషిలో నేను కూడా చేరటం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ మధ్య కాలంలో నేను నగరానికి దూరంగా ఉండటంవలన, నేను తెవికీ లో ఏమీ కృషి చేయలేకపోయానండి. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించండి. ఇక ముందు క్రమం తప్పకుండా తెవికీ లో వ్యాసాలు రాస్తానండి. Talapagala VB Raju 05:36, 12 ఫిబ్రవరి 2012 (UTC)

క్యాలెండరు మూసలు పునరుద్ధరింపుసవరించు

రాజుగారు, క్యాలెండరు మూసలు ఇక 2037 వరకు పనిచేస్తాయి. చరిత్రలో ఈ రోజు కి మీరు చేసిన కృషి అమోఘం. ఇక ఏదైనా సహాయం కావలిస్తే అడగండి. -- అర్జున 13:22, 28 డిసెంబర్ 2011 (UTC)

అర్జున గారు, క్యాలెండరు మూసలు ఇక 2037 వరకు పనిచేస్తాయని తెలిసి చాలా ఆనందించానండి. ఈ మధ్య నేను విశాఖపట్నంలో లేకపోవటంవలన వికీపీడియా కి కూడా దూరమయ్యానండి. ఇక నుంచి నేను మరలా వికీపీడియా లో, నా పని మొదలు పెడతానండి. మీ అందరి సహాయ సహకారల వలన, మీరు దారి చూపటంవలన మాత్రమే, నేను "చరిత్రలో ఈ రోజు' లో బాగా కృషి చేయగలిగాను. ఈ సమిష్టి కృషి ముందు ముందు మరింత గా పెరగాలని కోరుకుంటున్నాను. Talapagala VB Raju 05:31, 12 ఫిబ్రవరి 2012 (UTC)

ధన్యవాదాలుసవరించు

చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ మెరుగు పరచటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా మీ సభ్య పేజీలో బార్న్ స్టార్ పతకం చేర్చాను. (ఆలస్యమైనందుకు క్షమించండి)-- అర్జున 13:56, 28 డిసెంబర్ 2011 (UTC)

అర్జున గారు, నమస్కారము. బార్న్ స్టార్ పతకం పొందినందుకు ఆనందంగా ఉందండి. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. నగరంలో లేక పోవటం వలన తెవికీ లో పాల్గొన లేకపోయానండి. ఇక ముందునుంచి, తెవికీలో వ్యాసాలను రాస్తానండి. చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ గురించి ఎంత రాసినా తరగదు. ఈ వ్యాసాన్ని మరింతగా అభివృద్ధి చేయటానికి నావంతు పని ,నేను చేస్తానండి. చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ వ్యాసం ఇంతగా పరిపుష్టం కావటానికి, మీ లాంటి పెద్దల సహాయ సహకారాలు, దారి చూపటమే కారణాలు. ఇందులో నా పాత్ర స్వల్పమేనండి. Talapagala VB Raju 05:45, 12 ఫిబ్రవరి 2012 (UTC)

స్వాగతంసవరించు

రాజుగారికి, విశాఖపట్నం జిల్లా, భారతీయ శిక్షాస్మృతి అభివృద్ధిలో మీ కృషి ప్రశంసనీయం. ఎందువలననో ఈ మధ్య కాలంలో మీరు వికీపీడియాలో రచనలు చేయడం లేదు. సమయాభావమనే అనుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు వికీపీడియాకు పునరుత్తేజాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాము. అందుకు మీవంటి అనుభవజ్ఞులైన వారి సహాయం ఎంతో అవసరం. అందువలన మిమ్మల్ని తిరిగి వికీలో రచనలు చేయమని విన్నవించుకుంటున్నాము. వీలుచూసుకొని మీతో మాట్లాడతాను.Rajasekhar1961 09:58, 21 జనవరి 2012 (UTC)


రాజశేఖర్ గారికి నమస్కారము. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. నగరంలో లేక పోవటం వలన తెవికీ లో పాల్గొన లేకపోయానండి. ఇక ముందునుంచి, తెవికీలో వ్యాసాలను రాస్తానండి. మీ లాంటి పెద్దలు సహాయ సహకారాలు అందిస్తూ , దారి చూపుతూ ఉండగా, మరిన్ని వ్యాసాలు రాయాలి అన్న ఉత్సాహం కలుగుతుందండి. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ఫొటో, కార్యాలయంలోపల వీడియో తీసి (యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్ లింకు ఇవ్వాలని భావిస్తున్నానండి). తెవికీ లో పెట్టాలని అనుకుంటున్నానండి. ఆ పని కూడా తొందరలోనే చేస్తానండి. న్యాయ శాస్త్రంలో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ చట్టము కూడా రాయాలని ఉంది. అవి కూడా మొదలు పెడాతానండి. మనం రాబోయే శనివారం వెబ్ ఛాట్ లో మాట్లాడు కుందామండి. శెలవు. Talapagala VB Raju 05:54, 12 ఫిబ్రవరి 2012 (UTC)

ధన్యవాదాలు. ఈ మూడు నెలలు వికీలో జిల్లాలకు సంబంధించిన పేజీలను అభివృద్ధిచేయాలని ప్రణాళిక పెట్టుకున్నాము. మీరు విశాఖపట్నం జిల్లా అభివృద్ధి బాధ్యతను తీసుకోగలరా. వీలైతే ఆదివారం వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్ లో పాల్గొని చర్చించండి.Rajasekhar1961 12:53, 16 ఫిబ్రవరి 2012 (UTC)
కృతజ్ఞతలు. తప్పకుండా తీసుకుంటానండి. నా శాయశక్తులా కృషి చేస్తాను. Talapagala VB Raju 13:55, 25 ఫిబ్రవరి 2012 (UTC)
మీరు జిల్లావ్యాసం పై త్వరలో కృషిచేయాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:43, 7 మే 2012 (UTC)

మీ రచనలపై సలహాసవరించు

సివిల్ సర్వీస్ వ్యాసంలో మీ మార్పు తుడిచాను ఎందుకంటే మీ ‌విషయం వర్తమానానికి సంబంధించినదై వికీ తగనిదికావున. మరిన్ని వివరాలకు WP:NOTచూడండి.--అర్జున (చర్చ) 05:27, 21 మే 2012 (UTC)

ధన్యవాదాలు. WP:NOT చూసానండి. ఇకముందు ఆ నియమాలు పాటిస్తానండి. Talapagala VB Raju (చర్చ) 11:43, 21 మే 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

విబి రాజు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 16:49, 13 మార్చి 2013 (UTC)

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రంసవరించు

  కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
వీరభద్రరాజు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో చరిత్రలో ఈ రోజు విస్తరణ మరియు ప్రభుత్వ, పరిపాలన సంబంధ వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

దూరం - అంధ్రప్రదేశ్ నగరాల మధ్య దూరం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

దూరం - అంధ్రప్రదేశ్ నగరాల మధ్య దూరం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇందులో ఇచ్చిన సమాచారం తప్పు. పట్టికను సరిగ్గా తయారు చెయ్యకపోవడం వలన ఇలా జరిగింది. పైగా మూలాల్లేవు. దూరాలు సరిగ్గా రాసారో లేదో తెలియాలంటే సరైన మూలాలు ఇవ్వాలి. ఒక వారం లోగా ఈ మార్పులు జరక్కపోతే దీన్ని తొలగించాలి.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. చదువరి (చర్చరచనలు) 03:16, 2 డిసెంబరు 2016 (UTC) చదువరి (చర్చరచనలు) 03:16, 2 డిసెంబరు 2016 (UTC)