కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
 
==చతుర్థ భాగము==
::సా బ్రహ్మేతి హోవాచ
::బ్రహ్మణో వా ఏతద్ విజయే|
::మహియధ్వమితి; తతోహైవ
::విదాఞ్చాకార బ్రహ్మేతి|| 1
 
ఆచార్యుడు: అది బ్రహ్మం అనీ, బ్రహ్మం విజయంవలన కదా మీరు మహిమాన్వితులయ్యారు అని ఉమాదేవి అన్నది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుదు తెలుసుకున్నాడు.
 
::తస్మాద్ వా ఏతే దేవా అతితరా
::మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా|
::యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే
::హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి || 2
అందుచేతనే కదా ఈ దేవతలు - అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించినది. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు.
 
::తస్మాద్ వా ఇంద్రోఌ తితరా
::మివాన్యన్ దేవాన్; సహ్యేనన్నే|
::దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్
::ప్రథమో విదాంచకార బ్రహ్మేతి|| 3
 
ఇంద్రుడు ఈ బ్రహ్మంను సమీపంలో స్పృశించాడు. అందుచేతనే కదా ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించినది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో అతడే ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.
 
::తస్త్వైష ఆదేశః యదేతద్ విద్యుతో వ్యద్యుతదా|
::ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్|| 4
 
బ్రహ్మం వర్ణన ఇది: అహో! మిరుమిట్లు గొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే.మనిషిని రెప్పలు ఆర్పేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది.
 
::అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ|
::మనోఌనేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్పః|| 5
 
ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుంచి దాని వర్ణన గురించి; ఆ బ్రహ్మం వలననే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం ఉంచుకుంటుంది. వస్తువులను ఊహించుకుంటుంది.
 
::తద్ధ తద్వనం నామ
::తద్వనమిత్యుపాసితవ్యం|
::సమ ఏతదేవం వేదాభిహైనం
::సర్వాణి భూతాని సంవాచ్ఛంతి|| 6
 
బ్రహ్మం తద్వనం అనీ, అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధింపదగినదనెఎ ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి.
 
::ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్|
::బ్రాహ్మీం వవ త ఉపనిషదబ్రూమేతి|| 7
 
శిష్యుడు: ఆచారవర్యా! నాకు ఉపనిషత్తుని ఉపదేశించండి.
ఆచార్యుడు: నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గూర్చిన ఉపనిషత్తు నీకు ఉపదేశించాం.
 
::తస్త్వై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా|
::వేదాః సర్వాంగాని సత్య మాయతనమ్|| 8
 
తపస్సు, నిగ్రహం, నిష్ఠాపూర్వకమైన సర్మ - ఇవి దానికి (ఉపనిషత్తులోని బ్రహ్మ జ్ఞానానికి) మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం.
 
::యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన|
::మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి|| 9
 
నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకొన్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతమూ, మహోన్నతమూ, ఆనందమయమూ అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును దానిలో ప్రతిష్ఠితుడౌతాడు.
 
''శాంతి మంత్రం''
 
::ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్‌ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణిచ సర్వాణి|
::సర్వం బ్రహ్మౌపనిషదం మాఌ హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మే ఌ స్తు|
::తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తేమయిసన్తు తేజమయి సన్తు||
 
నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్ళు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక. నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మ నిరాకరణం కనీసం నాలో లేకుండు గాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమ గుణాలు ఆత్మ నిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకల ధర్మములు నెలకొనుగాక!
 
::::::::::ఓం శాంతిః శాంతిః శాంతిః
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు