రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రాజన్ - నాగేంద్ర తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==బాల్యం==
 
రాజన్ - నాగేంద్ర లు ఇద్దరూ మైసూరు కి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హర్మోనియం, వేణువుపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 ఏళ్ల వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్ లో పేరు వచ్చింది.
 
==యవ్వనం==
 
1947 వ సంవత్సరంలో హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి నాగేంద్ర గొంతు విని, ఎంతో ఆనందించి ఈ అన్నదమ్ములిద్దరిని తనతో పాటు మద్రాసు తీసుకువచ్చారు. ఆయన దగ్గర ఓ తమిళ సినిమాకి పనిచేశారు. 1951 లో ఇద్దరూ మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్.కళింగరావు దగ్గర చేరారు. ఈ యన దగ్గర ఎన్నో సంగీత సూత్రాలను ఆకళింపు చేసుకున్నారు. ఇలా ఓ పక్క సంగీతం నేర్చుకుంటుంటేనే ఓ పక్క మెట్రిక్ చదివేవారు.
 
==సినీ ప్రస్థానం==
 
1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "వద్దంటే పెళ్లి" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా విఠలాచార్య సినిమాలు చేసినా, 1976లో పూజ అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది.
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు