కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

kaaTaM laxminaarayana freedom fighter
 
పంక్తి 1:
== శీర్షిక పాఠ్యం ==
[[కాటం లక్ష్మీనారాయణ]] స్వాతంత్ర యోధుడు.
రంగరెడ్డి జిల్ల షంషాబాద్లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు 1924 వ సంవత్సరంలో సెప్టెంబరు 19 న కాటం లక్ష్మినారాయణ జన్మించాడు. ఇతని తాత గారు కాటం నారాయణ
స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత గారి పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడ మనమనికి వచ్చాయి. 1942 అక్టోబరు 12 న బూర్గుల రామక్రిష్ణ రావు చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండు లో సత్యాగ్రహం చేయడానికి సనాహాలు ప్రారంబించగా నైజాము పోలీసులు లాటీలు జులిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయన సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు రామ క్రిష్ణ రావుని, లక్ష్మినారయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామక్రిష్ణ రావుని గురువుగా బావించారు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలలపాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో వున్నారు. వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాటాలను నెర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ 'లా' పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడు గావుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించారు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడ పాలు పంచు కున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ్ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. అచార్య రంగా ప్రేరణ తో 1945 లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్య దర్క్షిగా పని చేశారు.
 
భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది, కాని నైజాము స్టేటు లో విముక్తి లబించ లెదు. బూర్గుల వాలు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుక రావలని వారి సహకారాని కోరాలని 1947 ఆగస్టు 15 న బూర్గులవారి తో కలిసి మద్రాసు చేరి రష్యా అమెరికా ప్రాన్సు వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి హైదరాబాదులు అడుగు పెట్టగానె నైజాము పోలీసులు వారి అరెస్ట్ చేసారు. కె.వి.రంగా రెడ్డిగారికి లక్ష్మినారాయణ అంటె చాల ఇస్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిఛయాలుండేవి. 1947 మే నెల 11 న పెళ్లి చేసుకొన్న లక్ష్మినరాయణ నాలుగు నెలలకె మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడం, అరెస్ట్ కావడం, తిరిగి రావడం, మళ్లి జైలుకెళ్లడం నిత్య కృత్యం అయింది.
"https://te.wikipedia.org/wiki/కాటం_లక్ష్మీనారాయణ" నుండి వెలికితీశారు