కింగ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఓ రాజభవనం వేలంపాటలో ప్రత్యర్థి ప్రతినాయకుని రెచ్చగొట్టి, 50 లక్షలు విలువచేసే భవనాన్ని రెండు కోట్లకు ప్రత్యర్థిని కొనేలా చేస్తాడు కింగ్. దీంతో "కింగ్" ఎలాంటివాడో తొలిదృశ్యంలోనే దర్శకుడు చూపిస్తాడు. చంద్రప్రతాపవర్మ (నాగార్జున) ను అందరూ "కింగ్' అని పిలుస్తుంటారు. ఆ వంశోద్ధారకుడు ఈయనే. "కింగ్" తల్లిదండ్రులు రాజావర్మ (శోభన్‌బాబు), తల్లి గీత. ఇతనికోక తమ్ముడు ఉంటాడు. అతని పేరు దీపక్. తండ్రి మరణంతో కింగ్ ఆ ఆస్తికి వారసుడవుతాడు. మరోవైపు కింగ్ మామయ్యలు ముగ్గురు ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తుంటారు.
 
ఆస్తిని దోచుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో వారు డబ్బులను రేసులు‌, పేకాటలకు హారతి కర్పూరం చేస్తుంటారు. ఆఖరికి ఇంట్లో దొంగతనం చేసి దాన్ని మేనేజర్‌పై పెట్టి ఇంటి నుంచి అతడిని వెళ్లగొడతారు. ఇది తెలిసిన కింగ్ వారిని నిలదీస్తాడు. ఇక తమకు అడ్డుపడుతున్న కింగ్‌ను ఎలాగోలా వదిలించుకోవాలని మేనమామలైన [[కృష్ణభగవాన్]], షిండే, [[జయప్రకాష్జయప్రకాశ్ రెడ్డి]] అవకాశం కోసం వేచి చూస్తుంటారు.
 
ఓ రోజు వ్యాపార నిమిత్తం ఉత్తరాంచల్‌కు కింగ్ ఒక్కడే వెళ్లాల్సివస్తుంది. ఇదే సరైన సమయమని మేనమామలు ముగ్గురు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనబడతారు. తీరా అక్కడికి వెళ్ళగానే కింగ్‌ను మమతామోహన్‌దాస్ రిసీవ్ చేసుకుంటుంది. వీరిద్దరూ మాట్లాడుతుండగానే ఓ ముసుగు వ్యక్తి కింగ్‌ను కాల్చేస్తాడు. అయితే గురితప్పుతుంది. అతడిని కింగ్ పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన వెనుక ఉన్న మమతా కింగ్‌ను కాల్చేస్తుంది. కింగ్ చనిపోతాడు.
"https://te.wikipedia.org/wiki/కింగ్_(సినిమా)" నుండి వెలికితీశారు