సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.1) (యంత్రము కలుపుతున్నది: sa:सुग्रीवः
పంక్తి 35:
 
==యుద్ధం==
[[File:Duel of Rawana and Sugreeva.jpg|thumb|రావణునితో పోరాడుతున్న సుగ్రీవుడు]]
హనుమంతుని కార్యసాధనాపాటవం వలన సీత జాడ తెలిసింది. తన అన్వేషణలో హనుమంతుడు రామలక్ష్మణులకు, వారికి విధేయుడైన సుగ్రీవునకు జయం ఘోషించాడు. లంకా నగరం ధ్వంసమైంది. రామలక్ష్మణసుగ్రీవులు రావణునిపై యుద్ధానికి నిశ్చయించారు. యుద్ధకాండలో సుగ్రీవుని ధీరత్వమూ, మిత్ర ధర్మమూ, నాయకత్వమూ చాలా ఉదాత్తంగా చూపబడ్డాయి. సీత దుస్థితి విని విచారిస్తున్న రాముని సుగ్రీవుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు.
నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిశగా పయనించింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. సాగర తీరం చేరిన వానరసేన మరొక సాగరంలా ఉంది. తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు.
Line 43 ⟶ 44:
 
"జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః" అని కపి సేన లంకను ముట్టడించింది. మొదటిరోజు జరిగిన భీకరయుద్ధం చివరిలో ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులు వివశులయ్యారు. అందరూ హతాశులయ్యారు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. ఇంతలో [[గరుత్మంతుడు]] వచ్చి నాగపాశాలనుండి విముక్తులను చేశాడు. యుద్ధంలో అంగదాది మహావీరులతో కలిసి విజృంభించిన సుగ్రీవుడు ఎందరో రాక్షసులను చంపేశాడు. కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో
సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. కుంభుడు సుగ్రీవుని పిడిగుద్దులతో హతుడయ్యాడు. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. ఇంకా ఎందరో రాక్షసులు సుగ్రీవుని చేత హతులయ్యారు.
 
==విజయం==
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు