పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
పుష్కర్ సంతలో పర్యాటకులను ఓంటెల సవారీలలో చిన్న చిన్న పల్లెసీమలను చూపుతూ అలాగే పంట కోతలు ఇతర పల్లె వాసుల పనిపాటలు చూసి ఆనందించే అవకాశం కలిగిస్తాయి.
=== ఇతర ఆకర్షణలు ===
[[File:Ghats at Pushkar lake, Rajasthan.jpg|thumb|right|రాజస్థానులోని పుష్కర్ సరస్సు లోని స్నానఘట్టం]]
* జైపూర్ నుండి దౌసా మీదుగా '''భాన్ద్రేజ్''', '''బన్గార్హ్''' మరియు మాధోపూర్ ఓడరేవు లను సందర్శించడానికి అద్దె కార్లు లభ్యం ఔతాయి.
* పుష్కర్ నగరశివార్ల సమీపంలో ఉన్న [[అజ్మీరు]] సందర్శన.
* అజ్మీర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్‌ఘర్. బాని తాని గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదర్శనశాలలో ప్రసిద్ధి చెందిన మినియేచర్ పైంటింగ్స్‌ను చూడవచ్చు.
* పుష్కర్‌లో ప్రధాన ఆకర్షణ పుష్కర్ సరస్సు. '''టిబెట్''' దేశంలో ఉన్న మానస సరోవరంలా అతిపవిత్రంగా పుష్కర్ సరస్సు భావించబడుతుంది. పుష్కర్ పుణ్యతీర్ధంగా భావించబడడానికి ఈ సరస్సే ప్రధాన కారణం. ఈ సరస్సు విశ్వమానవ సృష్టికర్త బ్రహ్మదేవుడి చేతి నుండి జారిపడిన తామర పూవు కారణంగా ఆ ప్రదేశంలో ఈ సరస్సు ఏర్పడిందని పురాణకధనాలు వర్ణిస్తున్నాయి.
* బ్రహ్మదేవుడి ఆలయం:- పుష్కర్ ప్రత్యేక ఆకర్షణ త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆలయం. [[బ్రహ్మ]]దేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్టించబడింది.
* సావిత్రి ఆలయం:- బ్రహ్మదేవుడి భార్య అయిన సావిత్రీదేవి రత్నగిరి మీద కొలువుతీరి ఉంది. సావిత్రి విగ్రహంతో సరస్వతి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టించబడి ఉంది.
* పాత పుష్కర్:- పుష్కర్ సరస్సుకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ పాత పుష్కర్ సరసు పునర్మించబడింది. భక్తుల చేత పాత పుష్కర్ సరస్సు కూడా సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపు పొందింది.
=== జనభా ===
2011 జనాభాగణనను అనుసరించి పుష్కర్ జనసంఖ్య 14,789 ఉంటుందని అంచనా. వీరిలో పురుషులు 54% స్త్రీలు 46% ఉన్నారు. అక్షరాస్త శాతం 69%.
ఇది జాతీయ అక్షరాస్యత అయిన 59.55% శాతం కంటే ఎక్కువ. పురుషుల అక్షరాశ్యత 77% స్త్రీల అక్షరాస్యత 60%. 6% సంవత్సరాల కంటే పిన్న వయస్కుల శాతం 14%.
=== ప్రయాణ సౌకర్యాలు ===
* వాయుమార్గం:- పుష్కర్ అతి సమీప విమానాశ్రయం జయపూర్ లోని సంగనర్ ఎయిర్ పోర్ట్. పుష్కర్‌కు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి '''ఢిల్లీ, ముంబాయి, ఇండోర్, కొలకత్తా''' వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి విమానసేవలు పొందవచ్చు.
* రోడ్డుమార్గం:- అజ్మీర్ ప్రధాన బస్టాండ్ నుండి పుష్కర్ 11 కిలోమీటర్లు ఉంటుంది. రాజస్థాన్ రహదారి మార్గం చాలా సౌకర్యవంతమైన బస్సులను నడుపుతుంటుంది. ఇక్కడ నుండి జయపూర్, అజ్మీర్, ఇండోర్, నగ్డా లకు ప్రతి 15 నిముషాలకు ఒక బస్సు నడుస్తూఉంటుంది.
* రైలుమార్గం:- పుష్కర్‌కు అతి సమీప రైలు స్టేషన్ అజ్మీరు రైలు స్టేషన్. ఇక్కడ నుండి బ్రాడ్‌గేజ్ మార్గంలో దేశంలోని మహానగారాలైన న్యూఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, అహమ్మదాబాద్, ఇండోర్, కాన్పూర్, లక్నో పాట్నా, భోపాల్, ట్రివేండ్రమ్, కొస్చిన్ వంటి నగరాలకు రైళ్ళు నడుస్తుంటాయి. అజ్మీరు నుండి పుష్కర్‌కు బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో రైళ్ళు ఉన్నాయి.
 
=== బయటి లింకులు ===
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు