పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
[[File:Inde pushkar foire.jpg|thumb|left|2006 పుష్కర్ మేళా]]
[[File:Pushkar watering hole.jpg|thumb|right|పుష్కర్ ఒంటెలసంతలో నీటి కేంద్రం వద్ద ఒంటెలు]]
[[File:And the Sun Sets on Pushkar Fair.jpg|thumb|right|సాయం సమయంలో పుష్కర్]]
అయిదు రోజుల పాటు నిరంతరాయంగా జరిగే పల్లెవాసులకు తమ సాధారణ శ్రమజీవనం నుండి కొంత వెసులుబాటు మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. దేశంలోనే అతిపెద్ద పెంపుడు జంతువుల సంతగా పేరొందిన ఈ సంతలో 50,000 ఒంటెలు చుట్టుపక్కల నుండి కొన్ని మైళ్ళ దూరం నుండి తీసుకురాబడి ఇక్కడ అమ్మడం కొనడం వంటి వాణిజ్యం జరుగుతుంది. అతి చురుకుగా సాగే ఈ వ్యాపార సంతలో అనేక ఒంటెలు చేతులు మారుతూ ఉంటాయి. అన్ని ఒంటెలు కడిగి శుభ్రంగా స్నానం చేయబడి, కొన్ని ఆకర్షణీయంగా వివిధ విధాలుగా అలంకరించబడి ఉంటాయి. ఒంటెలను పలు విధములుగా అలంకరించడానికి కావలసిన సామానులు మరియు ఆభరణాలు విక్రయించడానికి అనేక దుకాణాలు కూడా ఉంటాయి. పుష్కర్ ఒంటెల సంతలో పాల్గొనే ఒంటెలు శ్రద్ధగా అలంకరించబడి ఉంటాయి. అవి వెండి మరియు పూసలతో చేసిన ఆభరణములు ధరించి ఉంటాయి. ఒంటెల కాళ్ళకు తగిలించిన కడియలు మరియు గంటల కారణంగా అవి నడుస్తున్నప్పుడు చక్కని ధ్వనులు చేస్తాయి. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి. హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం షుమారుగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన
ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రధానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు మరియు గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు.
Line 61 ⟶ 62:
==== ఒంటెల సవారీ ====
భారతదేశంలోని ''' ధార్ ఎడారి '''ని ఒంటెల మీద సవారి చేస్తూ ఎడారి అందాలను తిలకించ వచ్చు. అతిపురాతనమైన ఆరావళి కొండచరియలను, ఇసుక తిన్నెలను చూడవచ్చు. పర్యాటకులను సుందమైన కొండచరియలు, ఇసుక తిన్నెలు, మైమరిపించే సూర్యోదయ సూర్యాస్తమయాలు విపరీతంగా ఆకర్షిస్తాయి.
పుష్కర్ సంతలో పర్యాటకులను ఓంటెల సవారీలలో చిన్న చిన్న పల్లెసీమలను చూపుతూ అలాగే పంట కోతలు ఇతర పల్లె వాసుల పనిపాటలు చూసి ఆనందించే అవకాశం కలిగిస్తాయి.
 
=== ఇతర ఆకర్షణలు ===
[[File:Ghats at Pushkar lake, Rajasthan.jpg|thumb|right|రాజస్థానులోని పుష్కర్ సరస్సు లోని స్నానఘట్టం]]
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు