ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
===ముని ఆశ్రమం, కుశలవులు===
[[దస్త్రం:DeviCat74B.jpg|thumb|వాల్మీకి ఆశ్రమములో సీతా దేవి]]
సీత అతను వెళ్ళేంతవరకూ అక్కడే ఉండి పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. " అని ఓదారుస్తాడు. ఆయన ఆశ్రమంలో ఉన్న అందరినీ పేరు పేరునా పిలచి జానికీ దేవికి ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకొనే భాధ్యతను అప్పగిస్తాడు. అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవకుశనామధేయులై దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.
 
===రాజసూయం===
ఇదిలా ఉండగా ఒక రోజు రాముడు తమ్ములను పిలిచి తనకు రాజసూయ యాగం చేయాలనున్నది అని చెపుతూ వారి సలహా అడుగుతాడు. భరతుడు అన్నకు అంజలి ఘటించి" ప్రభూ! నీ పాలనలో ధర్మదేవత చక్కగా నడుస్తోంది. కీర్తి చంద్రుడ్ని ఆశ్రియించిన వెన్నెలలా నిన్ను అంటిపెట్టుకొనే ఉన్నది. పాప కర్ములు అయిన రాజులు లేరు. ఈ భూమ్మీద ఉన్న సకల ప్రాణులకు ఏలికవు గతివి నువ్వే అని మరిచావా? రాజసూయం వల్ల అనేక రాజవంశాలు నేలమట్టం అవుతాయి. అందువల్ల రాజసూయం అనవసరమని నా అభిప్రాయం " అనగానే లక్ష్మణుడు అందుకొని" అన్నా! [[భరతుడు]] చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం, ధర్మయుక్తం. నీకు యాగం చేయాలని కోరిక ఉంది గనుక అశ్వమేధం చేయి. ఇది నిర్వహించి పూర్వం [[ఇంద్రుడు]] వౄతాసురవధ వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకం వదిలించుకొన్నాడు. " అంటాడు. శ్రీ రాముడికి వారి మాటలు బాగా నచ్చాయి. " సోదరులారా. మీరు చెప్పినమాటలు నాకు సమ్మతంగానే ఉన్నాయి. ఈ యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. " అని అనుమతిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు